కొన్ని ఆహారకలయికలు మన శరీరానికి సరిపడవు. సరికదా కొందరిలో తీవ్రమైన అలెర్జీలకు దారితీస్తాయి. వైద్యులు చెప్పిన దాని ప్రకారం చెడు ఆహార కలయికలు జీర్ణ వ్యవస్థలో సమస్యలు కలిగిస్తాయి. అలసట పెరగడం, వికారం, కొన్ని రకాల పేగు వ్యాధులు వచ్చే అవకాశం. ఉంది. తిన్న వెంటనే ఇవి కనిపించొచ్చు, లేదా దీర్ఘకాలంలో బయటపడొచ్చు. కాబట్టి కొన్ని రకాల ఆహారాలు కలిపి తినడం మానేయాలి. ముఖ్యంగా గుడ్లు. గుడ్లు గురించి ఎంత చెప్పినా తక్కవే. శరీరానికి మేలు చేసే పదార్థాల్లలో దీనిదే మొదటి స్థానం. పోషకాలతో, ప్రోటీన్లతో, విటమిన్లతో లోడ్ అయి ఉన్న పవర్ ప్యాక్డ్ ఆహారం ఇది. రోజుకో గుడ్డు తినమని ప్రభుత్వ ఆహార సంస్థలు కూడా ప్రచారం చేస్తున్నాయి. అయితే గుడ్డుతో పాటూ కొన్ని రకాల ఆహారాలను మాత్రం కలిపి తినవద్దని చెబుతున్నారు న్యూట్రిషనిస్తులు. 


1. పంచదార
గుడ్డు తిన్న వెంటనే పంచదార తినడం లేదా పంచదార తిన్న వెంటనే గుడ్డు తినడం చేయద్దు. ఉడకబెట్టిన గుడ్డును ముక్కలు చేసి దానిపై పంచదార చల్లుకుని తినడం కూడా చేయకండి. ఈ కాంబినేషన్ అమైనో ఆమ్లాలను విడుదల చేస్తుంది. శరీరంలో ఇవి విషపూరితంగా మారతాయి. రక్తంలో గడ్డలు ఏర్పడటానికి కూడా కారణం కావచ్చు. 


2. సోయా మిల్క్
సోయా పాలు, ఉడకబెట్టిన గుడ్డును బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటున్నారా, మానేయడం ఉత్తమం. ఇది మీ శరీరంలో ప్రోటీన్ శోషణను అడ్డుకుంటుంది. 


3. టీ
చాలా మందికి ఉన్న అలవాటు ఇది. బ్రేక్ ఫాస్ట్ లో ఆమ్లెట్ లేదా ఉడకబెట్టిన గుడ్లు తినడం, ఆ వెంటనే టీ తాగడం. ఈ ఆహారపు కలయిలు మలబద్ధకానికి దారితీస్తుంది. శరీరానికి తీవ్రమైన హానిని కూడా కలిగించవచ్చు. 


4. చేపలు
చేపలు తిన్నరోజు గుడ్లను తినకపోవడం మంచిది. కొందరికి ఏం కాకపోవచ్చు కానీ, పడని వారిలో మాత్రం అలెర్జీ సమస్యలు తలెత్తుతాయి. 


5. పనీర్
పనీర్, గుడ్లు విడివిడిగా చూస్తే చాలా టేస్టీ, హెల్ధీ. కానీ కలిపి తింటే బ్యాడ్ కాంబినేషన్ అవుతుంది. చాలా మంది పనీర్ కర్రీలో గుడ్లు వేయడం, గుడ్లు కూరలో పనీర్ కలపడం వంటివి చేస్తుంటారు. ఈ కాంబినేషన్ కొందరిలో అలెర్జీలకు దారితీస్తుంది. కొన్ని రకాల వ్యాధులు కూడా అభివృద్ధి చెందుతాయి. 


6. అరటిపండు
గుడ్లు తిన్నాక అరటి పండును ఎప్పుడూ తినకండి. ముఖ్యంగా జిమ్ కు వెళ్లేవారు అరటిపండు, గుడ్లు ఒకేసారి తినకండి. అజీర్తి సమస్యలు పెరుగుతాయి. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.