ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్ పోరులో జపాన్ క్రీడాకారిణి, ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ విజేత అయిన అకానె యమగుచిపై పీవీ సింధు విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ 70 నిమిషాల పాటు సాగింది.
ఈ మ్యాచ్‌లో 21-15, 15-21, 21-19తో యమగుచిని సింధు మట్టి కరిపించింది. మొదటి సెట్‌లో సింధు, రెండో సెట్‌లో యమగుచి విజయం సాధించగా.. నిర్ణయాత్మక మూడో సెట్ హోరాహోరీగా సాగింది. ఈ సెట్‌ను సింధు 21-19తో గెలిచి సింధు ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
ఆదివారం జరగనున్న ఫైనల్‌లో దక్షిణ కొరియా ప్లేయర్ అన్ సెయంగ్‌తో పీవీ సింధు తలపడుతుంది. వీరిద్దరూ గతంలో రెండు సార్లు తలపడగా.. రెండు సార్లు అన్ సెయంగే విజయం సాధించింది. ఈ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో ఫైనల్‌కు చేరడం సింధుకు ఇది మూడోసారి. 2018లో సింధు ఈ టైటిల్ కూడా గెలిచింది. ఈ ఘనత సాధించిన మొదటి ఇండియన్ పీవీ సింధునే.
ఈ టోర్నీకి ముందు ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్‌లో సింధు ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది. సెమీస్‌లోనే ఓటమి పాలై వచ్చేసింది. అంతకుముందు మార్చిలో జరిగిన స్విస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. పీవీ సింధు, అకానె యమగుచి ఇప్పటి వరకు 21 మ్యాచ్‌ల్లో తలపడ్డారు. పీవీ సింధు 13 సార్లు యమగుచిపై విజయం సాధించగా, యమగుచి ఎనిమిది సార్లు సింధును ఓడించగలిగింది.
Also Read: Ganguly on Laxman: హైదరాబాద్‌ను వదిలేస్తున్న వీవీఎస్.. మా లక్ష్మణ్ బంగారం అంటున్న గంగూలీ!
Also Read: Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి