ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద.. ఆసక్తికర దృశ్యం కనిపించింది. వెస్ట్రన్ నేవల్ కమాండ్ శనివారం రోజున ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ప్రదర్శించింది. 1400 కిలోల బరువున్న ఈ జెండాను ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ రూపొందించింది. దీనిని మెుత్తం ఖాదీతోనే తయారు చేశారు.
'భారత నౌకాదళం దేశ సేవకు తనను తాను తిరిగి అంకితం చేసుకుంటుంది. స్మారక జాతీయ జెండాను ప్రదర్శించి.. భారతదేశ ప్రయోజనాలను రక్షించడానికి ఎల్లప్పుడూ ఉంటుంది.' అని భారత నౌకాదళం ట్వీట్ చేసింది.
'భారతదేశంలో నేవీ డేని.. మొదటిసారిగా 21 అక్టోబరు 1944న రాయల్ ఇండియన్ నేవీ జరిపింది. ఇది రాయల్ నేవీ చేసుకునే.. ట్రఫాల్గర్ డేతో సమానంగా జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 4న జరుపుకుంటున్నాం' అని ఇండియన్ నేవీ గుర్తుచేసుకుంది.
మే 1972 సీనియర్ నేవల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత నావికాదళం గొప్పతనాన్ని గుర్తుచేసుకోవడానికి డిసెంబర్ 04న నావికాదళ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో భాగంగా దాయాది పాకిస్థాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో డిసెంబరు 4న భారత నౌకాదళం విరోచితంగా పోరాడింది. కరాచీ పోర్టుపై మెరుపుదాడి చేసి వారి యుద్ధ నౌకలను ధ్వంసం చేసింది. బంగాళాఖాతంలోని పాక్ ప్రాదేశిక జలాలు భారత్ స్వాధీనంలోకి వచ్చాయి. మరోవైపు, వాయుసేన సైతం పాక్ వైమానిక స్థావరాలపై దాడిచేసి కకావికలం చేసింది. ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 4న నేవీ డే జరుపుకుంటున్నారు.
Also Read: Vinod Dua: సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా కన్నుమూత...