ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒమిక్రాన్ భయంతో ఫోరెన్సిక్ డాక్టర్... తన భార్య, పిల్లల్ని హత్యచేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వైద్యుడు హత్య విషయాన్ని తన సోదరుడికి తెలియజేశాడు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో మానసిక అనారోగ్యానికి గురైన ఫోరెన్సిక్ వైద్యుడు భార్యాపిల్లల్ని హత్య చేశాడు. కాన్పుర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫోరెన్సిక్ విభాగాధిపతిగా పనిచేస్తున్న సుశీల్‌ కల్యాణ్‌పుర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ హత్యల ఎందుకు చేశాడో తన డైరీలో నోట్‌ రాశాడు. కరోనా మహమ్మారి నుంచి వారిని విడిపించడం కోసం ఇలా చేశానని తన డైరీలో రాసుకున్నాడు. నయం చేయలేని ఓ వ్యాధితో తాను బాధపడుతున్నట్లు వైద్యుడు అందులో రాశాడు. కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని విడిచిపెట్టదని ప్రతీ ఒక్కరినీ చంపేస్తుందని అందులో పేర్కొన్నాడు. భార్య పిల్లల్ని చంపేసినట్లు సోదరుడికి వాట్సాప్ మెసేజ్‌ చేశాడు.


Also Read: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్‌ మామూలుగా ఉండదు


మత్తు మందు ఇచ్చి ఆపై హత్య 


భార్య, పిల్లల్ని హత్య చేసిన వైద్యుడు సుశీల్ పోలీసులకు ఈ విషయాన్ని తెలపాలని కోరుతూ తన సోదరుడికి మెసేజ్ పంపాడు. పోలీసులకు హత్యల గురించి సుశీల్ సోదరుడు తెలియజేశాడు. పోలీసులు అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా తాళం వేసిఉంది. సెక్యూరిటీ గార్డుల సాయంతో తాళం పగలగొట్టి అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లిన పోలీసులకు వైద్యుడి భార్య చంద్రప్రభ(48), మైనర్లు కుమారుడు, కుమార్తె మృతదేహాలు రక్తపు మడుగులో కనిపించాయి.  భార్యను గొంతునులిమి హత్య చేసిన నిందితుడు కుమారుడు, కుమార్తెను సుత్తితో కొట్టి హత్య చేశాడు. హత్యకు ముందు వీరందరికీ మత్తు మందు ఇచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నాక హత్య చేశాడని పోలీసులు తెలిపారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న వైద్యుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. వైద్యుడు సుశీల్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. సుశీల్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. 


Also Read: తక్కువ కులం వ్యక్తితో ప్రేమ... కన్న కూతుర్నే హత్య చేసిన అమ్మ, అమ్మమ్మ...


Also Read:  శిల్పాచౌదరి ట్రాప్ లో పడ్డ యువ హీరో... రూ.3 కోట్లు మోసం చేసిందని ఫిర్యాదు 


Also Read: ఫోన్ లిఫ్ట్ చేయలేదని, ఇంటికి వెళ్లి చూస్తే షాక్.. దారుణమైన స్థితిలో తల్లీ కూతుళ్లు..! అసలేం జరిగిందంటే..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి