కొన్ని నిమిషాల కిందట పొరుగింటి వారితో మాట్లాడుతూ ఉన్నారు. నిమిషాల వ్యవధిలో తల్లీకూతుళ్లు హత్యకు గురి కావడం ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. రాత్రి 8 గంటలకు పొరుగింటివారితో మాట్లాడారు. 20 నిముషాలకు ఆ ఇంటికి ఫోన్ కాల్ వస్తే వారు లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత ఇంటికి వచ్చి చూస్తే ఇద్దరూ విగత జీవులుగా రక్తపుమడుగులో పడి ఉన్నారు. ఈ సీన్ చూసి రవి షాకయ్యారు. భార్య శ్రీదేవి, కుమార్తె లేఖన విగతజీవులుగా పడి ఉండటం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అత్యంత దారుణం ఏంటంటే.. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు ఇద్దరినీ గొంతు కోసి దారుణంగా హత్య చేశారు దుండగులు. రవి బంగారం వ్యాపారి కావడం, ఇంట్లో బంగారు నగలు లేకపోవడం చూస్తే ఇదేదో దోపిడీ అనే అనుమానం వస్తుంది. అయితే తల్లీకూతుళ్లను దారుణంగా గొంతుకోసి హత్య చేయడం, అందులోనూ రాత్రి 8 గంటల ప్రాంతంలోనే ఈ ఘటన జరగడంతో మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరులో జరిగిన ఈ జంట హత్యల విషయంలో పోలీసులకు అన్నీ అనుమానాలే.. ఈ కేసులో కనీసం ఒక క్లూ కూడా లేకపోవడంతో కేసు చిక్కుముడి విప్పడం పోలీసులకు కష్టమైంది.


పట్టణంలో బంగారం దుకాణం నిర్వహించే రవికిషోర్ అనే వ్యక్తి భార్య శ్రీదేవి, కుమార్తె లేఖన దారుణహత్యకు గురయ్యారు. ఈ కేసు విషయంలో పోలీసులకు ఎలాంటి క్లూ లభించకపోవడంతో, ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏకంగా జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ కూడా రంగంలోకి దిగి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ జంటల హత్యల ఉదంతం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. 


టంగుటూరులోని సింగరాయకొండ రోడ్డులో రవి కిశోర్ గోల్డ్ షాప్ నడుపుతున్నారు. ఇంటికి వస్తున్నానని చెప్పేందుకు రాత్రి 8 గంటల 20 నిముషాలకు ఫోన్ చేశాడు. అయితే భార్య గానీ, కుమార్తె గానీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఏదో పనిలో ఉంటారులే అనుకోని ఇంటికి వెళ్లి చూసిన రవి కిషోర్ కు ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది. హాల్ లో కుమార్తె రక్తపు మడుగులో పడి ఉంది. భార్య కోసం వెతకగా బెడ్ రూంలో ఆమె కూడా రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో ఒక్కసారిగా కేకలు వేస్తూ రవి కిషోర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ ఇంటికి సమీపంలోనే ఉండే పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే క్లూస్ టీమ్ తో రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టారు. ఇంట్లో కొన్ని నగలు పోయినట్టు గుర్తించారు. 
Also Read: Hyderabad Crime: శిల్పాచౌదరి ట్రాప్ లో పడ్డ యువ హీరో... రూ.3 కోట్లు మోసం చేసిందని ఫిర్యాదు 


అయితే ఈ జంట హత్యలపై పోలీసులు పలు కోణాల్లో విచారణ ప్రారంభించారు. తల్లీ కూతుళ్లను ఇంత దారుణంగా, కిరాతకంగా ఎందుకు చంపాల్సి వచ్చిందో, అసలు ఎవరికి ఆ అవసరం ఉందో ఆరా తీస్తున్నారు. ఇటీవలే రవి కిశోర్ తమ్ముడు రంగాకు చెందిన బంగారు దుకాణంలోనూ చోరీ జరిగింది. ఆ కేసు కూడా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడు తాజాగా జరిగిన హత్యలకు, గతంలో జరిగిన దోపిడీకి, ఏవైనా సంబంధాలు ఉన్నాయేమోనని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో జరిగిన దోపిడీ జరిగిన తీరును.. ఆ కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను కూడా పిలిపించి వివరాలను తీసుకున్నారు. గతంలో దోపిడీ జరిగిన సమయంలో ఏమైనా ఆధారాలు దొరికాయేమోనని లోతుగా విచారణ చేస్తున్నారు. జంట హత్యల వ్యవహారం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారింది. కేవలం నగలు దొంగతనం కోసమే ఈ హత్యలు చేశారా, లేక పాత కక్షల నేపథ్యంలో హత్యలు జరిగాయా అని ఆరా తీస్తున్నారు. 
Also Read: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్‌ మామూలుగా ఉండదు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి