పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపాను... ఉత్తర,వాయవ్య దిశగా కదులుతోంది. గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో తీరం వైపునకు దూసుకొస్తోంది. విశాఖకు 250కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 360కిలోమీటర్లు, పూరీకి 430కిలోమీటర్లు, పారాదీప్‌నకు 510కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
జవాద్ తుపాను రేపు తీరం దాటే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ఉత్తర, వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాను... ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలోకి రానుంది. ఐదో తేదీన ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే ఛాన్స్ ఉంది. సాయంత్రానికి పూర్తిగా బలహీనపడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలా బలహీనపడిన తుపాను పశ్చిమ బంగా వైపు వెళ్లిపోనుంది.
ఇవాళ (శనివారం)తుపాను ప్రభావంతో చాలా ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తక్కువ ప్రాంతాల్లోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.
ఒడిశా దక్షిణ కోస్తా , ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షపాతం నమోదు కావచ్చు.
రేపు(ఆదివారం) ఒడిశా, వెస్ట్‌బంగాల్, అసోం, మేఘాలయ, మిజోరాంలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 70నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నాలుగు ఐదు తేదీల్లో ఈ గాలుల ప్రభావం ఉంటుందని కూడా హెచ్చరించింది.
ఈ తుపాను ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గజపతి, గంజాం, పూరీ, ఖుర్దా, నయాగడ్, కటక్, జగత్‌సింగ్‌పుర్, కేంద్రపరా జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని... సముద్రం ఈ మూడు రోజులు అల్లకల్లోలంగా ఉంటుందని సూచించారు.
Also Read: ఉత్తరాంధ్రపై అధికారుల స్పెషల్ ఫోకస్.. ప్రాణ నష్టం ఉండకూడదన్న సీఎం జగన్
Also Read: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి