ఏపీ వైపు జవాద్ తుపాను దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. తుపాను విశాఖకు 770 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 850 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తుపాను మారే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. వాయుగుండం ప్రస్తుతం గంటకు 32 కి.మీ వేగంతో ముందుకు కదులుతోంది. శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు.


తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయని కన్నబాబు చెప్పారు. శనివారం ఉత్తరాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంలో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. రేపు ఉదయం నుంచి 70-90కి.మీ వేగంలో బలమైన గాలులు వీస్తాయని..  భారీ వర్ష సూచనతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


Also Read: తరుముకొస్తోన్న జవాద్ తుపాను.. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం


తూర్పు గోదావరి జిల్లాలో అలెర్ట్


బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని రెవెన్యూ అధికారుల ఆదేశాలు జారీచేశారు. సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలిస్తామని అధికారులు తెలిపారు. అంతర్వేది నుంచి అద్దరిపేట వరకు తూర్పుగోదావరి జిల్లాలో 147 కిలోమీటర్ల పొడవున సముద్రతీరం ఉంది. జిల్లాలో 14 తీర మండలాలు ఉండగా సుమారు 80 తీర గ్రామాలపై తుపాను ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఓడలరేవు, అంతర్వేది, ఉప్పాడ తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. 


Also Read: 'జవాద్' ధాటికి ఒడిశా, ఉత్తరాంధ్రలో హైఅలర్ట్.. రంగంలోకి భారత నేవీ


తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఇళ్ల చుట్టూ ఉండడంతో తుపాను సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం ప్రమాదం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచింంచారు. 1996లో పెను తుపానులో కోనసీమలోని తీర గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. 1996 నవంబర్ 6న వచ్చిన తుపాను సమయంలో.. కోనసీమలో సుమారు 1400 మంది మరణించారు. 


Also Read: వీఆర్వోలను తరిమికొట్టండి...మంత్రి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు... మంత్రిని బర్తరఫ్ చేయాలని వీఆర్వోలు డిమాండ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి