జవాద్ తుపాను ఒడిశా వైపు ముంచుకొస్తోంది. డిసెంబర్ 5న పూరీ వద్ద జవాద్ తుపాను తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారినట్లు పేర్కొంది.
జవాద్ తుపాను వల్ల ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బంగాల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తుపాను కారణంగా పలు తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది ఒడిశా ప్రభుత్వం. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని ఐఎండీ డైరక్టర్ జనరల్ మృత్యుంజయ మహోపాత్ర సూచించారు.
ఒడిశా- కేంద్రం కలిసి..
తుపాను ప్రభావం వల్ల కలిగే నష్టాన్ని వీలైనంత తగ్గించేలా ఒడిశా-కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయి. జవాద్ తుపాను ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ నిన్న సమీక్షించారు.
సహాయక బృందాలు..
24 ఎన్డీఆర్ఎఫ్, 158 రాష్ట్ర అగ్నిమాపక సేవల బృందాలు, 33 ఓడీఆర్ఏఎఫ్ను ఆయా ప్రాంతాల్లో మోహరించాలని ఇప్పటికే ఒడిశా సర్కార్ ఆదేశించింది. లోతట్టు ప్రాంత ప్రజలను తరలించేందుకు చర్యలు చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లో..
తుపానును ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తీర ప్రాంత జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ మాట్లాడారు. తుపానును ఎదుర్కొనేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Also Read: Pak's Serbia Agency: ఇమ్రాన్ ఖాన్ రాజ్యంపై 'కట్టప్పల' తిరుగుబాటు.. పాక్ పరువు తీసిన ఉద్యోగులు!
Also Read: Omicron Variant: ఒమిక్రాన్‌పై షాకింగ్ నిజాలు.. డెల్టా కంటే ఆ విషయంలో మూడు రెట్లు ఎక్కువట!
Also Read: Corona Cases: ఒమిక్రాన్ భయాల వేళ ఊరట.. దేశంలో 10 వేలకు దిగువనే కొత్త కేసులు
Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక
Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్'పై గుడ్ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి