దేశంలోకి ఒమిక్రాన్ ఏంట్రీ ఇచ్చింది. బెంగళూరులోనే రెండు కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జినోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలో వెల్లడైనట్లు స్పష్టం చేసింది.






దేశంలో మరింత ప్రబలే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి జినోమ్ సీక్వెన్సింగ్‌లో ఒమిక్రాన్ నిర్ధారణైంది. ఒమిక్రాన్ సోకిన వారిలో ఒకరికి 66 ఏళ్లు ఉండగా, మరొకరికి 46 ఏళ్లు ఉన్నట్లు సమాచారం.


ప్రధాని సమీక్ష..


ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్ర‌ధాని మోదీ అత్య‌వ‌స‌ర స‌మీక్ష నిర్వహించారు. ప్రస్తుత ప‌రిస్థితిని ప్ర‌ధానికి ఆరోగ్య‌శాఖ అధికారులు వివరించారు.


భయపడొద్దు..


ఒమ్రికాన్ వేరియంట్‌ కేసులు దేశంలో నమోదు కావడంతో తీవ్ర భయాందోనలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు ఒమ్రికాన్ భయంతో ఆంక్షలు విధించాయి. ఇలాంటి వేళ ఒమిక్రాన్ వేరియంట్‌ షాకింగ్ నిజాలు చెప్పారు ఉత్తర్‌ప్రదేశ్‌ కొవిడ్ అడ్వైజరీ కమిటీ ఛైర్‌పర్సన్ డా. ఆర్‌కే. ధీమాన్. 


ఒమిక్రాన్ వేరియంట్ సోకిన దక్షిణాఫ్రికాకు చెందిన ఎంతోమంది బాధితుల రిపోర్టులను తాను క్షుణ్ణంగా పరిశీలించినట్లు ధీమాన్ వెల్లడించారు. ఆ నివేదికల ప్రకారం ఒమిక్రాన్.. డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరం కాదని ధీమాన్ స్పష్టం చేశారు. అయితే వ్యాప్తి మాత్రం ఎక్కువ అని పేర్కొన్నారు.


ఆ ఇద్దరు..


డా. ధీమాన్‌తో పాటు, ఐసీఎమ్‌ఆర్ ఎపిడెమియోలజిస్ట్ చీఫ్ డా. సమీరన్ పాండా.. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వ్యాప్తి, లక్షణాలపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ప్రకారం ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ ఇది డెల్టా వైరస్ కంటే ప్రమాదకరంకాదని తేల్చారు. అంతేకాకుండా ఈ వేరియంట్ సోకిన వారు ఆసుపత్రిలో చేరే పరిస్థితులు కూడా చాలా తక్కువన్నారు. మరణాల శాతం కూడా తక్కువే ఉండటం ఊరట కలిగించే విషయమన్నారు. అయితే ఈ వైరస్‌పై ఇంకా పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!


Also Read:  Delhi Air Pollution: దిల్లీ సర్కార్‌కు సుప్రీం డెడ్‌లైన్.. రేపటి నుంచి పాఠశాలలు బంద్


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు, 477 మంది మృతి


Also Read: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్


Also Read:  ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది


Also Read: టమోటో సూప్‌ను ఇలా చేసుకుని తాగండి... క్యాన్సర్‌ను కూడా అడ్డుకుంటుంది


Also Read: ఎయిడ్స్ లక్షణాలు ఏంటి? ఆ రోగులు ఏం తినాలి? ఏం తినకూడదు?


Also Read: ఓమ్రికాన్ వేరియంట్ వేళ...ఈ బ్లడ్ గ్రూపుల వాళ్లకే హై రిస్క్, చెబుతున్న ఇండియన్ అధ్యయనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి