ఒమ్రికాన్ వేరియంట్‌పై తీవ్ర భయాందోనలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు ఒమ్రికాన్ భయంతో ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి వేళ ఒమిక్రాన్ వేరియంట్ షాకింగ్ నిజాలు చెప్పారు ఉత్తర్‌ప్రదేశ్ కొవిడ్ అడ్వైజరీ కమిటీ ఛైర్‌పర్సన్ డా. ఆర్‌కే. ధీమాన్.
ఒమిక్రాన్ వేరియంట్ సోకిన దక్షిణాఫ్రికాకు చెందిన ఎంతోమంది బాధితుల రిపోర్టులను తాను క్షుణ్ణంగా పరిశీలించినట్లు ధీమాన్ వెల్లడించారు. ఆ నివేదికల ప్రకారం ఒమిక్రాన్.. డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరం కాదని ధీమాన్ స్పష్టం చేశారు. అయితే వ్యాప్తి మాత్రం ఎక్కువ అని పేర్కొన్నారు.
ఆ ఇద్దరు..
డా. ధీమాన్‌తో పాటు, ఐసీఎమ్‌ఆర్ ఎపిడెమియోలజిస్ట్ చీఫ్ డా. సమీరన్ పాండా.. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వ్యాప్తి, లక్షణాలపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ప్రకారం ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ ఇది డెల్టా వైరస్ కంటే ప్రమాదకరంకాదని తేల్చారు. అంతేకాకుండా ఈ వేరియంట్ సోకిన వారు ఆసుపత్రిలో చేరే పరిస్థితులు కూడా చాలా తక్కువన్నారు. మరణాల శాతం కూడా తక్కువే ఉండటం ఊరట కలిగించే విషయమన్నారు. అయితే ఈ వైరస్‌పై ఇంకా పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఆక్సిజన్ లెవల్..
ఒక్క కేసు కూడా లేదు..
డెల్టా వేరియంట్ వచ్చిన కొత్తలో మరణాల రేటు గణనీయంగా పెరిగిందని, కానీ ఒమిక్రాన్ విషయంలో అలా లేదని ధీమాన్ అన్నారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ఎంతమాత్రం ప్రమాదకరం కాదని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ వేరియంట్ కేసు కూడా నమోదు కాలేదని గుర్తు చేశారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
కంగారు పడొద్దు..
Also Read: Worlds Expensive City: ఈ నగరం చాలా కాస్ట్‌లీ!.. వెళ్తే జేబులో డబ్బులు ఖాళీ!
Also Read: Omicron Travel Rules: భారత్‌కు వస్తున్నారా? అయితే ఈ 10 పాయింట్లు పక్కా గుర్తుంచుకోండి!
Also Read: Petrol Price: తగ్గిన పెట్రోల్ ధరలు.. వాహనదారులకు బంపర్ ఆఫర్.. వ్యాట్ తగ్గించిన సర్కార్
Also Read: Govt on Farmers Protests: 'ప్చ్.. రైతులు చనిపోయారా? మాకు తెలియదే.. పరిహారం ఎలా ఇస్తాం?'
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదు, 267 మంది మృతి
Also read: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు
Also Read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు