లింగమార్పిడి అనేది ఈ కాలంలో సాధారణమైపోయింది. అయితే కొన్నిచోట్ల వారి పట్ల వివక్ష కనిపిస్తూనే ఉంది. కానీ ఓ మహిళా కానిస్టేబుల్ విషయంలో ఏకంగా ప్రభుత్వమే.. ఎలాంటి సమస్య లేదు.. చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చని చెప్పింది. అసలు విషయం ఏంటంటే.. మధ్యప్రదేశ్‌లోని ఓ మహిళా కానిస్టేబుల్ పురుషుడిగా లింగ మార్పిడి చేసుకునేందుకు రాష్ట్ర హోం శాఖకు దరఖాస్తు చేసుకుంది. 


2019లో లేడీ కానిస్టేబుల్.. తన లింగాన్ని మార్చుకునేందుకు డీజీపీ ఆఫీసుకు దరఖాస్తు పెట్టుకుంది.  తాను ఎందుకు పురుషుడిగా మారాలని అనుకుంటుందో.. తన ఉద్దేశం ఏంటో అందులో వివరించింది. అయితే డీజీపీ కార్యాలయం.. ఆమె దరఖాస్తును హోం శాఖకు పంపింది. అప్పటి నుంచి పెండింగ్ లోనే ఉంది. అయితే తాజాగా లింగ మార్పిడికి అనుమతినిస్తూ.. నిబంధనల ప్రకారం.. భారతీయ పౌరులు.. తన మతం మరియు కులాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తన లింగాన్ని ఎంచుకునే హక్కును కలిగి ఉంటారని.. ఈ ప్రాతిపదికన, కానిస్టేబుల్ తన లింగాన్ని మార్చుకోవడానికి రాష్ట్ర హోం శాఖ అనుమతినిచ్చింది. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఉద్యోగంలో కొనసాగొచ్చని ప్రభుత్వం చెప్పింది. 


మధ్యప్రదేశ్‌లో లింగ మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి అని.. రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రాజేష్ రాజౌరా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను హోంశాఖ బుధవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపినట్లు ఆయన పేర్కొన్నారు.  


ఇక నుంచి.. ఇతర మగ కానిస్టేబుల్ లాగానే ఆమె తన అన్ని విధులను నిర్వర్తిస్తుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారించామని ప్రముఖ సైకాలజిస్టులు తెలిపారు. మహిళా కానిస్టేబుల్‌కు చిన్నప్పటి నుంచి జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ ఉన్నందున లింగమార్పిడి చేసుకునేందుకు వీలుగా హోం శాఖ.. అనుమతినిచ్చింది.
 


Also Read:  భారత్‌ వస్తున్నారా? అయితే ఈ 10 పాయింట్లు పక్కా గుర్తుంచుకోండి!


Also Read: తగ్గిన పెట్రోల్ ధరలు.. వాహనదారులకు బంపర్ ఆఫర్.. వ్యాట్ తగ్గించిన సర్కార్


Also Read:  'ప్చ్.. రైతులు చనిపోయారా? మాకు తెలియదే.. పరిహారం ఎలా ఇస్తాం?'


Also Read:  దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదు, 267 మంది మృతి


Also read: నాలుగు రోజులుగా సిరివెన్నెల ప్రాణం నిలిచింది ‘ఎక్మో’పైనే... ఎక్మో అంటే? అదెలా ఆయన ప్రాణాలు నిలిపింది?


Also read: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు


Also Read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి