దేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు సరికొత్త మార్గదర్శకాలను ప్రకటించింది భారత్. ముఖ్యంగా ''ముప్పు''గా పేర్కొన్న దేశాల నుంచి వద్దే వారు తప్పకుండా ఈ మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు దిల్లీ విమానాశ్రయం ట్వీట్ చేసింది.
ఇప్పటివరకు దేశంలో ఒక్క ఒమ్రికాన్ వేరియంట్ కేసు కూడా నమోదుకాలేదని ప్రభుత్వ ప్రకటించింది. 'ముప్పు' ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కచ్చితంగా ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేయించాలని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.
ఐరోపా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోస్త్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాలు ప్రస్తుతం ఒమ్రికాన్ ''ముప్పు'' దేశాలుగా పేర్కొన్నారు.
మార్గదర్శకాలు..
1. భారత్ వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు కచ్చితంగా నెగెటివ్ ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్టుతో స్వీయ ధ్రువీకరణ పత్రాని సువిధా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రయాణానికి 72 గంటల ముందు ఈ పరీక్ష చేయించుకోవాలి.
2. ''ముప్పు'' దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కచ్చితంగా ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష నిర్వహించాలి. ఆ పరీక్ష ఫలితాలు వచ్చేవరకు వారు విమానాశ్రయం నుంచి వెళ్లే అవకాశం లేదు.
3. 'ముప్పు' దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ కరోనా పరీక్ష ఫలితాలు వచ్చే వరకు విమానాశ్రయంలోనే ఉండేందుకు సిద్ధంగా ఉండాలి. కనక్టింగ్ ఫ్లైట్స్‌ను బుక్ చేసుకోకూడదు.
4. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. 'ముప్పు' దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలో నెగెటివ్ రిపోర్టు వస్తే వాళ్లు 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. 8వ రోజు మరోసారి టెస్ట్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఏడు రోజుల పాటు తమ ఆరోగ్యంపై పర్యవేక్షణ చేసుకోవాలి.
5. ఒకవేళ పాజిటివ్ వస్తే బాధితుడు.. ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రంలో ఉండాలి. ఆ శాంపిల్‌ను జినోమిక్ టెస్టింగ్‌కు పంపిస్తారు. ఒకవేళ రోగి జినోమిక్ శాంపిల్ ఒమ్రికాన్ వేరియంట్ నెగెటివ్ వస్తే ఫిజీషియన్ సలహా మేరకు డిశ్ఛార్జి చేస్తారు. ఒక వేళ ఒమ్రికాన్ పాజిటివ్ అయితే కఠిన ఐసోలేషన్ సహా చికిత్సను మొదలుపెడతారు.
6. పాజిటివ్‌గా తేలిన వారికి దగ్గరగా ఉన్నవారు కచ్చితంగా వ్యవస్థీకృత క్వారంటైన్‌లో లేదా హోం క్వారంటైన్‌లో ఉండాలి. వీరిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షించాలి.
7. ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకునే ఒక్కో ప్రయాణికుడు రూ.1700 చెల్లించాలి. ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష, పరీక్ష ఫలితాలు వచ్చేవరకు అవసరమైన ఆహారం, తాగు నీరు కోసం ఈ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
8. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి రేండమ్‌గా ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేస్తారు.
9. 'ముప్పు' దేశాలు నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చేవారు విమానాశ్రయం నుంచి వెళ్లిపోవచ్చు. అయితే తరువాతి 14 రోజుల పాటు తమ ఆరోగ్యాన్ని స్వీయ పర్యవేక్షణ చేసుకోవాలి.
10. 'ముప్పు' దేశాల నుంచి ముంబయి ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులంతా కచ్చితంగా ఏడు రోజుల వ్యవస్థీకృత క్వారంటైన్ పాటించాలి. రెండు, నాలుగు, ఏడో రోజు మొత్తం మూడు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. పరీక్ష ఫలితాలు నెగెటివ్ వచ్చిన తర్వాత మాత్రమే వారిని వెళ్లేందుకు అవకాశం ఉంది.
Also Read: Petrol Price: తగ్గిన పెట్రోల్ ధరలు.. వాహనదారులకు బంపర్ ఆఫర్.. వ్యాట్ తగ్గించిన సర్కార్
Also Read: Govt on Farmers Protests: 'ప్చ్.. రైతులు చనిపోయారా? మాకు తెలియదే.. పరిహారం ఎలా ఇస్తాం?'
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదు, 267 మంది మృతి
Also read: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు
Also Read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు