దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై వ్యాట్ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో దిల్లీలో పెట్రోల్ ధర రూ.8 మేర తగ్గింది.





ఈరోజు అర్ధరాత్రి నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నట్లు దిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సీఎం కేజ్రివాల్ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.






ఇంకా తగ్గుతాయి..


అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో పతనం మరికొంతకాలం కొనసాగితే పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గే అవకాశం ఉంది. దేశీయంగా ఇంధన ధరల నిర్ణయించే సమయంలో 15 రోజుల రోలింగ్‌ యావరేజ్‌ ఆధారంగా నిర్ణయిస్తారు. నవంబర్‌ నెలలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 80 డాలర్ల నుంచి 82 డాలర్ల మధ్యలోనే ఉంది.


కరోనా కొత్త వేరియంట్‌ చమురు మార్కెట్లలో భయాన్ని నింపింది. ఈ వైరస్‌ వ్యాపిస్తే మరోసారి చమురు డిమాండ్‌ భారీగా పతనం అవుతుందని అంచనావేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ సంస్థలు రోజు వారీ చమురు ధరలను నిర్ణయిస్తున్నాయి. ఈ ప్రక్రియకు పక్షం రోజుల చమురు ధరలను పరిగణలోకి తీసుకొంటారు. ముడి చమురు తగ్గుదల మరికొన్నాళ్లు కొనసాగితే రిటైల్‌ ధరల్లో కోత కనిపించే అవకాశం ఉంది.


చమురు దిగుమతి చేసుకొనే ప్రధాన దేశాలు వ్యూహాత్మక నిల్వల్లో కొంత భాగాన్ని ఓపెన్‌ మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ దేశాల జాబితాలో అమెరికా, భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియా ఉన్నాయి. భారత్‌ దాదాపు 50 లక్షల పీపాల చమురు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. చమురు ఉత్పత్తి చేసే దేశాల సంఘం ఒపెక్‌+కు వ్యతిరేకంగా పలు దేశాలు ఈ నిర్ణయం తీసుకొన్నాయి. భారత్‌ కూడా తొలిసారి తన వ్యూహాత్మక నిల్వలను వాడటం మొదలుపెట్టింది. కొన్ని నెలలుగా ఒపెక్‌+ దేశాలు కోటాలు విధించుకొని మరీ డిమాండ్‌ కంటే తక్కువ చమురును ఉత్పత్తి చేస్తున్నాయి. ఫలితంగా ధర పెరుగుతోంది. ఇప్పటికే భారత్‌ పలు వేదికలపై ఈ దేశాలను ఉత్పత్తి పెంచాల్సిందిగా కోరింది.


Also Read: Govt on Farmers Protests: 'ప్చ్.. రైతులు చనిపోయారా? మాకు తెలియదే.. పరిహారం ఎలా ఇస్తాం?'


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదు, 267 మంది మృతి


Also read: నాలుగు రోజులుగా సిరివెన్నెల ప్రాణం నిలిచింది ‘ఎక్మో’పైనే... ఎక్మో అంటే? అదెలా ఆయన ప్రాణాలు నిలిపింది?


Also read: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు


Also Read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి