ట్విటర్‌కు కొత్త సీఈవో వచ్చిన వేళ.. ఓ కీలక నూతన నిబంధనను సంస్థ ప్రవేశపెట్టింది. నెట్వర్క్ పాలసీల్లో భాగంగా ఇతరుల ప్రైవేటు ఫోటోలను వారి అనుమతి లేకుండా షేర్ చేయడాన్ని బ్లాక్ చేసింది. ట్విటర్‌కు సీఈవో మారిన ఒక రోజులోనే ఈ కీలక మార్పు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కొత్త నిబంధనల్లో భాగంగా.. పబ్లిక్ ఫిగర్స్ కాని వ్యక్తులకు సంబంధించిన వారి ఫోటోలను వారి అనుమతి లేకుండా ఎవరైనా పోస్ట్ చేసినట్లు గుర్తిస్తే ఆ చిత్రాలు లేదా వీడియోలను తొలగించాలని ట్విటర్‌ని అడగవచ్చు. అక్కడే ఉండే రిపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా ఇది పని చేస్తుంది.
అయితే, ఈ తాజా నిబంధన అనేది పబ్లిక్ ఫిగర్స్ లేదా సెలబ్రిటీలుగా వెలుగొందే వారి విషయంలో వర్తించదని ట్విటర్ వెల్లడించింది. అంతేకాక, ప్రజా ప్రయోజనార్థం మీడియా సంస్థలు దాన్ని ఉపయోగించడం లేదా ఎంబేడ్ చేసే సందర్భాల్లో కూడా ఈ నిబంధన వర్తించబోదని స్పష్టం చేసింది.
‘‘ఇతరులు షేర్ చేసిన ఫోటోలు లేదా వీడియోలను వారు ఏ ఉద్దేశంతో చేశారో తెలుసుకొనేందుకు మేం ప్రయత్నిస్తూనే ఉంటాం.’’ అని ట్విటర్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
యూజర్లు తమకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు లేదా సమాచారాన్ని.. ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తులు ప్రత్యేకించి హానికర ఉద్దేశంతో రీ పోస్ట్ చేయడం అనేది ఒక సమస్యగా మారింది. ఏళ్ల తరబడి దీనికి పరిష్కారం లేదు. ట్విటర్ ఇప్పటికే ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ ఫోన్ నంబర్ లేదా అడ్రస్ వంటి ప్రైవేట్ సమాచారాన్ని ట్విటర్‌లో బహిర్గతం చేయడాన్ని నిషేధించింది. అయితే ఈ సమాచారంతో ‘వేధింపులకు గురి చేయడం లేదా హాని తలపెట్టడం, భయపెట్టడం, వ్యక్తుల గుర్తింపులను బహిర్గతం చేయడం వంటి ఆందోళనలు ఉన్నాయని ట్విటర్ తెలిపింది.
ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో గేమ్ స్ట్రీమింగ్ సైట్ అయిన ట్విచ్‌లో జాత్యహంకార, లైంగికపరమైన, స్వలింగ సంపర్క సంబంధిత ఆన్‌లైన్ వేధింపులు వెలుగు చూశాయి. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం వల్ల ఏర్పడ్డ హై ప్రొఫైల్ ఆన్ లైన్ వేధింపులకు సంబంధించిన ఉదాహరణలు. ఇలాంటి వేధింపులకు సంబంధించిన సందర్భాలు కోకొల్లలు. ఆన్‌లైన్ మాధ్యమాల నుంచి తమను తాము బాధపెట్టే, అవమానించే లేదా చట్టవిరుద్ధంగా రూపొందించిన చిత్రాలను చూడటానికి బాధితులు తరచుగా సుదీర్ఘ పోరాటాలు చేయాల్సి ఉంటుంది.
ట్విటర్ సహ-వ్యవస్థాపకుడు జాక్ డోర్సే తాను కంపెనీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన మరుసటి రోజు ఈ మార్పు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..
Also Read: Parag Agrawal Twitter CEO: ట్విట్టర్ సీఈవోగా మనోడు.. టెక్ కంపెనీల్లో కొనసాగుతున్న భారతీయుల హవా
Also Read: The Uncle North Korea: ‘ది అంకుల్’ సినిమా చూశాడని బాలుడి అరెస్ట్.. 14 ఏళ్లు జైలు శిక్ష
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి