కరోనా తీవ్రత తగ్గి కాస్త కుదుట పడుతున్నానుకునేలోపు డెల్టా వేరియంట్ వచ్చి పడింది. దాన్ని నుంచి తప్పించుకున్నామనుకుంటే ఇప్పుడు ఓమ్రికాన్ వేరియంట్ పుట్టుకొచ్చింది. దాని తీవ్రతేంటో ఇంతవరకు తెలియలేదు. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండడం మాత్రం అవసరం. కరోనా విషయంలో ఏ బ్లడ్ గ్రూపులు వాళ్లకు హై రిస్క్ అనే అంశాన్ని తెలుసుకునేందుకు దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో అధ్యయనాలు నిర్వహించారు. ఆ అధ్యయనం ప్రకారం A, B, Rh+ బ్లడ్ గ్రూపులు హైరిస్క్ గ్రూపులో ఉన్నట్టు   తేలింది. బి బ్లడ్ గ్రూప్ కు చెందిన మహిళలతో పోలిస్తే, మగవారు త్వరగా ఇన్ఫెక్షన్  గురయ్యే అవకాశం ఉన్నట్టు చెప్పారు పరిశోధకులు. O, AB, RH- బ్లడ్ గ్రూపులు ఉన్న వారికి మాత్రం సంక్రమణ ప్రమాదం తక్కువగా ఉందని తెలిపారు. 


అధ్యయనం ఇలా...
ఏప్రిల్ 8, 2020 నుంచి అక్టోబర్ 4, 2020 మధ్య ఆసుపత్రిలో చేరిన 2,586 మంది కోవిడ్ పాజిటివ్ రోగులపై అధ్యయనం నిర్వహించారు. ఆ అధ్యయనంలనో అధికంగా ఏ, బి రక్త సమూహాలు కలిగిన రోగులే ఉన్నారు. అలాగే ఆడవారితో పోలిస్తే మగవారే అధికంగా ఇన్ఫెక్షన్ బారిన పడినట్టు గుర్తించారు. 


పరిశోధనలో A, B, O, AB బ్లడ్ గ్రూపులలో ఏవి అధిక శాతం ఇన్ఫెక్షన్ కు త్వరగా గురవుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో A బ్లడ్ గ్రూపు ఉన్నారు 29.93 శాతం, B బ్లడ్ గ్రూప్ ఉన్నవారు 41.8 శాతం, O బ్లడ్ గ్రూప్ ఉన్న వారు 21.19 శాతం, AB బ్లడ్ గ్రూప్ ఉన్న వారు 7.89 శాతం మంది కోవిడ్ బారిన పడ్డారు. 


రక్త గ్రూపుకు, కోవిడ్‌కు మధ్య బంధం...
రక్త గ్రూపుకు, కరోనా ఇన్ఫెక్షన్ మధ్య సంబంధం ఉన్నట్టు కేవలం ఈ అధ్యయనమే కాదు చాలా పరిశోధనలు తేల్చాయి.  చైనాతో పాటూ ఇతర దేశాలలో కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్‌‌కు ABO, Rh రక్త సమూహాలకు అనుబంధం ఉన్నట్టు చాలా కథనాలు ప్రచురితమయ్యాయి.  వాటన్నింటిలో A బ్లడ్ గ్రూప్‌లో ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది, O బ్లడ్ గ్రూప్‌లో ఇన్‌ఫెక్షన్ రేటు మరియు తీవ్రత తక్కువగా కనిపిస్తోంది.


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read Also: ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది


Read Also: టమోటో సూప్‌ను ఇలా చేసుకుని తాగండి... క్యాన్సర్‌ను కూడా అడ్డుకుంటుంది
Read Also: ఎయిడ్స్ లక్షణాలు ఏంటి? ఆ రోగులు ఏం తినాలి? ఏం తినకూడదు?
Read Also: కొత్త వేరియంట్ కమ్ముకుంటున్న వేళ... ఎవరికి బూస్టర్ డోస్ అవసరం?
Read Also: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి