టికెట్ టు ఫినాలే టాస్క్ లో గెలవడానికి బిగ్ బాస్ కొన్ని ఛాలెంజ్ లను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగా నిన్న హౌస్ మేట్స్ 'ఎండ్యూరెన్స్' ఛాలెంజ్ సెలెక్ట్ చేసుకోగా.. ఐస్ టబ్ లో ఎక్కువసేపు నుంచొని ఆడే గేమ్ వచ్చింది. ఈరోజు ఆ గేమ్ కంటిన్యూ అయింది.
సిరితో సన్నీ గొడవ.. : గేమ్ మధ్యలో సిరి తన బాల్స్ లాక్కోవడంతో సన్నీ ఫైర్ అయ్యాడు. ఇప్పుడు ఆడతా నేను అంటూ తన గేమ్ మొదలుపెట్టాడు. సిరి దగ్గర బాల్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుండంతో.. ఆమె ఐస్ టబ్ లో నుంచి బయటకు రాకుండా అలానే ఉండిపోయింది. 'నేను గివప్ చేయను.. రవి ఐ మిస్ యూ' అంటూ డైలాగ్స్ వేసింది. 'పెర్సనల్ గ్రడ్జ్ తో ఎందుకు గేమ్ ఆడతావ్' అని సన్నీని ప్రశ్నించింది. 'ప్రతీ గేమ్ లో నువ్ పెట్టుకుంటావ్ నాతో గొడవ.. అలా ఆడేది నువ్వు నేను కాదు..' అని అన్నాడు సన్నీ. దీంతో ఇద్దరిమధ్య వాగ్వాదం జరిగింది.
శ్రీరామ్.. సిరికి సపోర్ట్ చేయడంతో అతడిపై కూడా ఫైర్ అయ్యాడు సన్నీ. మరోపక్క సిరి ఎక్కువసేపు ఐస్ టబ్ లో ఉండిపోవడంతో ఆమె కాలి స్పర్శపోయి ఏడ్చేసింది. వెంటనే బిగ్ బాస్ హౌస్ లోకి డాక్టర్ ని పంపించారు. దీనంతటికీ సన్నీ కారణమన్నట్లుగా షణ్ముఖ్ చూడడంతో సన్నీకి మరింత కోపమొచ్చింది.
'ఇంకా ఎంత బ్లేమ్ చేస్తారు నన్ను..' : 'ఏం రాంగ్ ప్రూవ్ చేయాలనుకుంటున్నారు.. ఇంకా ఎంత బ్లేమ్ చేస్తారు నన్ను' అంటూ కాజల్ దగ్గర ఫీలైయ్యాడు సన్నీ. 'నువ్ తప్పు ఆడలేదు. కావాలని ఎక్కువసేపు ఐస్ టబ్ లో ఉంది సిరి. వాళ్ల గేమ్ వాళ్లు ఆడుకుంటున్నారు' అని సన్నీకి నచ్చజెప్పింది. 'గేమ్ లో రవి అని అంటున్నారు.. రవిని నామినేట్ చేసింది వాళ్లే.. ఇన్ఫ్లుయెన్సర్, మానిప్యులేటర్ అని ట్యాగ్స్ ఇచ్చింది వాళ్లే.. ఈరోజేమో ఇలా' అంటూ మానస్ తన ఫీలింగ్ బయటపెట్టాడు.
మరోవైపు సిరి తనకు నొప్పిగా ఉందని షణ్ముఖ్ కి చెప్పగా.. 'నాకు లేదా నొప్పి.. నేను ఆడలేదా గేమ్.. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి మనిషికి. నాకు ఇంత వీక్ ఫ్రెండ్ ఉందని సిగ్గేస్తుంది. ఛీ' అంటూ షణ్ముఖ్ డైలాగ్స్ కొట్టాడు.
ఏడ్చేసిన సన్నీ.. : శ్రీరామ్ కాళ్లు కూడా బాగా హర్ట్ అవ్వడంతో డాక్టర్ ని పిలిపించి ట్రీట్మెంట్ అందించారు. తనవల్లే సిరి, శ్రీరామ్ హర్ట్ అయ్యారని భావించిన సన్నీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బిగ్ బాస్ శ్రీరామ్ పాడిన 'గెలుపు తలుపులే' సాంగ్ ప్లే చేయగా.. శ్రీరామ్ చాలా ఎమోషనల్ అయిపోయాడు.
ఇక 'ఎండ్యూరెన్స్' గేమ్ లో అందరికంటే ఎక్కువ పాయింట్స్ సన్నీకి వచ్చాయి. ఆ తరువాత శ్రీరామ్, సిరిలకు వచ్చాయి. అందరికంటే తక్కువ పాయింట్స్ ప్రియాంకకు వచ్చాయి.
ఇక రెండో ఛాలెంజ్ కోసం అందరూ కలిసి 'ఫోకస్' ను ఎన్నుకున్నారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ సమయానుసారం ఇంటి సభ్యుల పేర్లు పిలిచినప్పుడు గార్డెన్ ఏరియాలో ఉన్న చైర్స్ పై కూర్చొని 29 నిమిషాలు లెక్కించడం మొదలుపెట్టాల్సి ఉంటుంది. సరిగ్గా 29 నిమిషాలు పూర్తయ్యాయి అనుకున్నప్పుడు గార్డెన్ ఏరియాలో బెల్ ని మోగించాల్సి ఉంటుంది. ఎవరైతే 29 నిమిషాలకు సరిగ్గా.. లేదా అందరికన్నా దగ్గరగా బెల్ మోగిస్తారో.. వారు ఈ ఛాలెంజ్ లో మొదటి స్థానంలో నిలుస్తారని చెప్పారు బిగ్ బాస్.
- ముందుగా బజర్ మోగగా.. మానస్-ప్రియాంకలను చైర్స్ లో కూర్చోమని చెప్పారు బిగ్ బాస్. కాజల్.. పింకీని ఆటపట్టించింది. మానస్ ఎప్పుడైతే గంట కొడతాడో.. అప్పుడు కొట్టడానికి రెడీగా ఉన్నావ్ కదా అని కామెడీ చేసింది. సిరి-షణ్ముఖ్ కూడా ప్రియాంకను బాగా ఆడుకున్నారు.
- సెకండ్ బజర్ కి సన్నీ-కాజల్ చైర్ లో కూర్చున్నారు. దీంతో హౌస్ మేట్స్ ఇద్దరినీ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు. సన్నీ ముందే మానస్ ని హెల్ప్ చేయమని అడగడంతో అతడు ఓకే చెప్పాడు. దీంతో మానస్ కౌంట్ చేసి సన్నీకి సిగ్నల్ ఇవ్వగా.. అతడు వెంటనే గంట కొట్టేశాడు.
- థర్డ్ బజర్ కి సిరి-షణ్ముఖ్ చైర్ లో కూర్చున్నారు. వాళ్లని డిస్టర్బ్ చేయడానికి సన్నీ-ప్రియాంక చాలానే ప్రయత్నించారు.
టికెట్ టు ఫినాలే టాస్క్ రేపటి ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అవ్వనుంది.
Also Read:'పావుగంటకొక పెక్.. రాత్రికొక పెగ్'.. బ్రహ్మానందంతో బాలయ్య అల్లరి..
Also Read: 'ఫోకస్' టాస్క్ ఫన్నీ టాస్క్ గా మారిపోయిందే..