ఒమిక్రాన్ వేరియంట్‌పై రోజుకో విషయం బయటకి వస్తోంది. ఒమిక్రాన్‌పై తాజా అధ్యయనం షాకింగ్ విషయాలు బయటపడింది. డెల్టా, బీటా స్ట్రెయిన్‌లతో పోలిస్తే ఒమిక్రాన్ రీఇన్‌ఫెక్షన్ రేటు మూడు రెట్లు ఎక్కువని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల ప్రాథమిక అధ్యయనంలో తేలింది. మెడికల్ ప్రీప్రింట్ సర్వర్‌లో అప్‌లోడ్ చేసిన ఈ నివేదికను ఇంకా సమీక్షించాల్సి ఉంది. 







సౌతాఫ్రికా ఆరోగ్య శాఖ నుంచి సేకరించిన సమచారం మేరకు ఈ అధ్యనం చేశారు. గతంలో వైరస్ బారినపడి లేదా టీకా తీసుకోవడం ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తిని తప్పించుకునే ఒమిక్రాన్ వేరియంట్ సామర్ధ్యం గురించి ఇదే మొట్టమొదటి శాస్త్రీయ ఆధారం కావడం విశేషం.


35 వేలకు పైనే..





నవంబర్ 27 వరకు దాదాపు 28 లక్షల మందికి కరోనా పాజిటివ్‌గా ఉన్నారు. ఇందులో 35,670 మంది రీఇన్‌ఫెకన్‌కు గురైనట్లు తేలింది. 90 రోజుల వ్యవధిలో రెండు సార్లు కరోనా పాజిటివ్‌గా తేలితే దాన్ని రీఇన్‌ఫెక్షన్ అంటారు.

 

"మూడు వేవ్‌లలో ప్రాథమికంగా వైరస్ సోకిన వ్యక్తులలో ఇటీవల రీఇన్‌ఫెక్షన్‌లు సంభవించాయి. డెల్టా వేవ్‌లో ఇది ఎక్కువగా ఉంది." అని జులియట్ పుల్లియమ్, దక్షిణాఫ్రికా డీఎస్ఐ ఎన్ఆర్ఎఫ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎపిడిమియాలాజికల్ మోడలింగ్ అండ్ అనాలిసిస్ విభాగం డైరెక్టర్ అన్నారు.




ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత సౌతాఫ్రికాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నవంబర్ మధ్యలో రోజుకు 300 కేసులు నమోదయ్యాయి. కానీ ఇటీవల వరుసగా రోజుకు 2273, 4373, 8561 కేసులు నమోదవుతున్నాయి.


Also Read: Corona Cases: ఒమిక్రాన్ భయాల వేళ ఊరట.. దేశంలో 10 వేలకు దిగువనే కొత్త కేసులు


Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక


Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి