వంటింట్లో స్టవ్ పాటూ కచ్చితంగా ఉండే వస్తువు ప్రెషర్ కుక్కర్.  పదార్థాలను త్వరగా, సులువుగా ఉడికించాలన్నా మొదట గుర్తొచ్చేది ప్రెషర్ కుక్కర్ మాత్రమే. చాలా మంది అన్నం, కూరలు కుక్కర్లో వండేందుకే ఇష్టపడతారు. కానీ కొన్ని వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు. వండడం వల్ల ఆ ఆహారపదార్థాలు విషపూరితంగా మారి శరీరంపై దుష్ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం ఒకేసారి కనిపించదు... స్లో పాయిజన్‌లా మెల్లగా శరీరంపై చూపిస్తుంది. 


1. అన్నం
ప్రెషర్ కుక్కర్లో అధికంగా వండే పదార్థాలలో అన్నం కూడా ఒకటి. నిజానికి ఇది చాలా హానికరం. ప్రెషర్ కుక్కర్లో అన్నం వండడం వల్ల అక్రిలమైడ్ అనే హానికరమైన రసాయనం ఏర్పడుతుంది. ఇది వెంటనే ప్రభావం చూపకపోయినా దీర్ఘకాలం కొనసాగితే మాత్రం  ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది. అలాగే ప్రెషర్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. 


2. బంగాళాదుంపలు
మనలో చాలామందికి ఉన్న అలవాటు బంగాళాదుంపలను ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టడం. ఎందుకంటే ఇది సులభమైన పని కాబట్టి. అయితే బంగాళాదుంపలలో స్టార్చ్ ఉంటుంది. పిండిపదార్థాలు అధికంగా ఉండే వాటిని కుక్కర్లో వండకూడదు. దీర్ఘకాలంగా ఇలా కుక్కర్లో ఉడకబెట్టిన బంగాళాదుంపలను తినడం వల్ల క్యాన్సర్, న్యూరోలాజికల్ డిజార్డర్ వంటి అనే ఆరోగ్య వ్యాధులకు దారితీస్తుంది. 


3. పాస్తా
పాస్తాలో కూడా పిండి పదార్థం అధికంగా ఉంటుంది. అందుకే దీన్ని కూడా కుక్కర్లో వండకూడదు. దీన్ని కళాయిలోనే వండుకోవాలి. పాస్తాను కుక్కర్లో ఉడికించే అలవాటు మానుకోవాలి. 


లాభాలు కూడా ఉన్నాయి...
పిండి పదార్థం అధికంగా ఉన్న పదార్థాలనే ప్రెషర్ కుక్కర్లో వండకూడదు. అవి విషపూరితంగా మారుతాయి. కానీ మిగతా ఆహారపదార్థాలను కుక్కర్లో వండుకోవచ్చు. దీనివల్ల ఆహారంలోని లెక్టిన్ రసాయనం స్థాయి తగ్గుతుంది. లెక్టిన్ అనేది హానికరమైన రసాయనం. ఇది ఆహారంలోని ఖనిజాలను గ్రహించి, పోషక విలువలను తగ్గిస్తుంది. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read also: ల్యాప్‌టాప్‌ను డిటెర్జెంట్‌తో ఉతికేసిన భార్య, ఆమె అతి శుభ్రత జబ్బుతో వేగలేనంటున్న భర్త, వీరి కథలో ఎన్ని ట్విస్టులో...


Read also: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్
Read also:  ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది
Read also: టమోటో సూప్‌ను ఇలా చేసుకుని తాగండి... క్యాన్సర్‌ను కూడా అడ్డుకుంటుంది
Read also: ఎయిడ్స్ లక్షణాలు ఏంటి? ఆ రోగులు ఏం తినాలి? ఏం తినకూడదు?
Read also: ఓమ్రికాన్ వేరియంట్ వేళ...ఈ బ్లడ్ గ్రూపుల వాళ్లకే హై రిస్క్, చెబుతున్న ఇండియన్ అధ్యయనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి