దేశంలో కరోనా కేసులు 10 వేల కంటే తక్కువే నమోదయ్యాయి. కొత్తగా 9,216 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 99,976 వద్ద ఉంది. గత 24 గంటల్లో 8,612 మంది కరోనా నుంచి రికవరయ్యారు.
- మొత్తం కేసులు: 34,61,5,757
- మొత్తం మరణాలు: 4,70,115
- యాక్టివ్ కేసులు: 99,976
- మొత్తం కోలుకున్నవారు: 3,40,45,666
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.29గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం.
రికవరీ రేటు 98.35%గా ఉంది. గత 60 రోజులుగా డైలీ పాజిటివిటీ రేటు 2శాతం కంటే తక్కువే ఉంది. ప్రస్తుతం 0.80 శాతం ఉంది.
ఇప్పటివరకు 64.46 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించారు.
వ్యాక్సినేషన్..
దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. గురువారం 73,67,230 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన మొత్తం డోసుల సంఖ్య 1,25,75,05,514కు చేరిందని స్పష్టం చేసింది.
కేరళ..
కేరళలో కొత్తగా 4,700 కరోనా కేసులు నమోదయ్యాయి. 320 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 51,40,090కి చేరగా మొత్తం మరణాల సంఖ్య 40,855కు పెరిగింది. గత 24 గంటల్లో 59,702 శాంపిళ్లు పరీక్షించారు.
Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక
Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్'పై గుడ్ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి