ఉద్యోగులకు సంబంధించి పే రివిజన్ కమిషన్ సిఫార్సులు ప్రక్రియ పూర్తయిందని పది రోజుల్లో ప్రకటిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. తిరుతిలో వరద ప్రాంతాల పర్యటనలో ఉన్న ఆయన వద్దకు కొంత మంది ఉద్యోగులు వెళ్లారు. వారితో మాట్లాడుతూ పీఆర్సీ సమస్యను పది రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : మరో మహాభారతం... పల్నాటి యుద్ధం ! వీరారాధన ఉత్సవాలు ప్రారంభం !
అయితే అమరావతిలోని ఉద్యోగ సంఘం నేతలు మాత్రం ముఖ్యమంత్రి పీఆర్సీపై హామీ ఇచ్చినట్లుగా తమకు అధికారిక సమాచారం లేదని ఉద్యోగ సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు ప్రకటించారు. సీఎం నిజంగా పది రోజుల్లో పీఆర్సీ ఇస్తామని ప్రకటించి ఉన్నట్లయితే స్వాగతిస్తామన్నారు. అయితే తమ సమస్య ఒక్క పీఆర్సీ మాత్రమే కాదని పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, జీపీఎఫ్ చెల్లింపులు, సీపీఎస్ రద్దు వంటివి ఉన్నాయి.
Also Read : వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ... మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం..
ఉద్యోగుల సమస్యల పరిష్కారం.. కొత్త పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు చాలా రోజులుగా ఆందోళనలు చేస్తునాయి. మూడు రోజుల కిందట ఉద్యమ కార్యాచరణను నోటీసు రూపంలో సీఎస్‌కు కూడా ఇచ్చారు. ఏడో తేదీ నుంచి నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే అనూహ్యంగా జీఎడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శుక్రవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. చర్చించుకుందాం రమ్మని ఉద్యోగ సంఘాలనేతలందరికీ ఆహ్వానం పంపారు. ఈ సమావేశం జరగక ముందే పది రోజుల్లో పీఆర్సీ ఇస్తామని సీఎం జగన్ తిరుపతిలో ఉద్యోగులకు హామీ ఇచ్చారు.
Also Read: ఏపీలో అధికార ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత.. సుమోటోగా హైకోర్టు విచారణ !
ప్రభుత్వం పీఆర్సీ విషయంలో గతంలో చాలా సార్లు ఇలాగే నేతలకు చెప్పింది. కనీసం పీఆర్సీ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అక్టోబర్ నెలాఖరు కల్లా పీఆర్సీ సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చినా అమలు కాలేదు. పీఆర్సీ రిపోర్టు కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎం ప్రకటన.. ఉద్యోగ సంఘాల స్పందన ఆసక్తికరంగా మారింది.
Also Read: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్ ఎప్పుడు ? లాంఛనాలు పూర్తి చేసినా కన్ఫర్మ్ చేయని ప్రభుత్వం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి