ఉత్కంఠభరితంగా సాగిన తొలిటెస్టు డ్రా గా ముగియగా రెండో టెస్టులో విజయం సాధించాలని అటు పర్యాటక న్యూజలాండ్ జట్టు, ఇటు ఆతిథ్య టీమిండియా ఉవ్విళ్లూరుతున్నాయి. ముఖ్యంగా అరంగేట్రంలోనే అదరగొట్టి శతకం, అర్ధ శతకాలతో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ కు జట్టులో స్థానం దక్కుతుందా లేదా అనే అంశంపై చర్చ జరిగింది. తాజాగా రెండో టెస్టు కూర్పుపై ఓ అప్ డేట్ ను బీసీసీఐ అందించింది. గాయం కారణంగా ముగ్గురు ఆటగాళ్లు ముంబైలో జరుగుతున్న రెండో టెస్టు నుంచి వైదొలిగారు.


ఇషాంత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్పెషలిస్ట్ బ్యాటర్ అజింక్య రహానే రెండో టెస్టు ఆడటం లేదు. గాయాల కారణంగా ఈ ముగ్గురు ముంబై వాంఖేడేలో జరుగుతున్న కీలకమైన రెండో టెస్టు ఆడటం లేదని బీసీసీఐ ట్వీట్ చేసింది. రహానేకు గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్‌కు మార్గం సుగమం అయింది. మరోవైపు మైదానం తడిగా ఉన్న కారణంగా టాస్ ఆలస్యమైంది. అంపైర్లు ఉదయం 10:30 గంటలకు మరోసారి మైదానంలోకి వచ్చి పరిశీలించనున్నారు. 
Also Read: IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు రేపే.. తెలుగు తేజానికి అవకాశం దక్కేనా?






ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కుడిచేతి ముంజేతి గాయం కారణంగా వైదొలిగాడు. కాన్పూరులో జరిగిన తొలి టెస్టులో గాయపడ్డాడు. స్కానింగ్ అనంతరం అతడు రెండో టెస్టుకు అందుబాటులో ఉండడని తేల్చారు. రహానే విషయానికొస్తే.. తొలి టెస్టులో చివరి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా గాయమైంది. పూర్తిగా కోలుకోని కారణంగా రహానే ముంబై టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. బీసీసీఐ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడూ ఆటగాళ్ల పరిస్థితిని చెక్ చేస్తుందని కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో తెలిపారు.
Also Read: IPL Retention: కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లపై ఏడాది నిషేధం తప్పదా..! గతంలో స్టార్ ఆల్ రౌండర్‌పై వేటు  


కివీస్ కెప్టెన్ విలియమ్సన్‌ సైతం..
భారత్‌తో జరుగుతున్న కీలకమైన రెండో టెస్టుకు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా దూరం కానున్నాడు. మూడో టెస్టుకు సైతం అతడు అందుబాటులో ఉండే అవకాశం కనిపించడం లేదు. ఎడమ మోచేతి గాయం వేధిస్తుండటంతో సిరీస్‌లో మిగతా టెస్టులకు విలియమ్సన్ అందుబాటులో ఉండటం లేదని కివీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి