ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాప్రతినిధులపై ఇష్టారాజ్యంగా కేసులు ఎత్తివేస్తున్న అంశాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించింది. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, విడదల రజని, జక్కంపూడి రాజా, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, మల్లాది విష్ణు, ఎంపీ మిథున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలపై ఉన్న క్రిమినల్ కేసులు ఎత్తివేస్తూ జీవోలు జారీ చేసింది. అయితే గత ఆగస్టులో సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులపై కేసుల ఎత్తివేత విషయంలో కీలక సూచనలు చేసింది. హైకోర్టు అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా కేసులు ఎత్తివేయకూడదని స్పష్టం చేసింది.  


Also Read : ఓటీఎస్ పథకం స్వచ్చందమే.. టీడీపీ కుట్ర చేస్తోందన్న మంత్రి బొత్స !


ప్రభుత్వాలు నడుపుతున్న అధికార పార్టీలు సొంత నేతలపై ఇష్టారాజ్యంగా అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులు కూడా ఎత్తివేస్తున్నాయని .. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు సంబంధించి అమికస్ క్యూరీగా నియమితులైన విజయ్ హన్సారియా నివేదిక సమర్పించారు. దీంతో  ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ విచారణను ఆయా రాష్ట్రాల హైకోర్టుల నుంచి ముందుగా అనుమతి లేకుండా వెనక్కి తీసుకోవడం ఇకపై కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.  


Also Read : ఏపీలో "ఓటీఎస్" దుమారం ! అసలేంటి ఈ పథకం ? ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు ?


ట్రయల్‌ కోర్టుల్లో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్స్‌ సమాచారం అందించాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు సూచనల మేరకు హైకోర్టులో ప్రజాప్రతినిధులపై కేసుల ఎత్తివేతను సుమోటోగా తీసుకుని జరుపుతున్నాయి.  ఏపీ హైకోర్టు కూడా ఇలాంటి  కేసురల విచారణ ప్రారంభించింది. హైకోర్టు అనుమతి లేకుండా విత్ డ్రా చేసుకున్న కేసులపై సుమోటోగా విచారణ ప్రారంభించిది. 


Also Read : రెండున్నరేళ్ల టర్మ్ పూర్తి ! ఏపీలో కొత్త కేబినెట్ ముహుర్తం ఎప్పుడు ?


ఈ కేసుల ఉపసంహరణపై హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిపోర్ట్ సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  కేసుల ఉపసంహరణకు ఎన్ని ప్రతిపాదనలు వచ్చాయో రిపోర్టు ఇవ్వాలని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును ఆదేశించింది.  తదుపరి విచారణను  24కు వాయిదా వేసింది. గతంలో సీఎం జగన్‌పై ఉన్న కేసులను కూడా ఏకపక్షంగా ఉపసంహరించుకున్నారు. ఈ కేసులపైనా హైకోర్టు సుమోటోగా విచారణ జరుపుతోంది.


 


Also Read : ఏపీకి వరద సాయం రూ.895 కోట్లిచ్చాం .. విజయసాయిరెడ్డికి కేంద్రమంత్రి ఆన్సర్ !


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి