ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని.. డీఎ బకాయిలు చెల్లించాలని.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న ప్రధాన డిమాండ్లతో ఉద్యమ బాట పడుతున్నట్లుగా పేజీల ఉద్యమ కార్యాచరణ లేఖను నోటీసు రూపంలో సీఎస్ సమీర్ శర్మకు నోటీసులు ఇచ్చారు. ఉద్యమం పూర్తి స్థాయిలో పట్టాలెక్కక ముందే ప్రభుత్వం స్పందించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. 7వ తేదీలోగా సమస్యలు పరిష్కరిస్తామని సీఎస్ సమీర్‌శర్మ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు.
Also Read : ఏపీ అప్పులపై ప్రధాని జోక్యం చేసుకోవాలి.. లోక్‌సభలో రఘురామ విజ్ఞప్తి !
ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట‌్ అని చెబితే మురిసిపోయామని కానీ ఆ మాటలన్నీ నీటి మూటలే అయ్యాయని ఉద్యోగ సంఘ నేతలు విమర్శలు గుప్పించారు. పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నామని అయినా స్పందన లేదన్నారు. ఉద్యమ కార్యాచరణను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణమన్నారు. కరోనా సమయంలో నాలుగున్నరవేల మంది ఉద్యోగులు చనిపోయారని.. ప్రభుత్వం కారుణ్య నియామకాలు జరపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికేతర సమస్యలు కూడా పరిష్కరించడం లేదన్నారు.
Also Read : ఏపీకి మరో ముప్పు.. దూసుకొస్తున్న 'జవాద్' సైక్లోన్ .. ఎక్కడుందో లైవ్ చూడండి!
ఆర్థిక మంత్రి బుగ్గన మాటలు ఉద్యోగులను కించపరిచే విధంగా ఉన్నాయని ఉద్యోగ సంఘం నేతలు విమర్శఇంచారు. పీఆర్సీ అమలు విషయంలో ఆర్థిక మంత్రి ఉద్యోగులతో చర్చలు జరపడం సంప్రదాయమన్నారు. కానీ బుగ్గన ఒక్క రోజు కూడా ఉద్యోగులతో మాట్లాడలేదన్నారు. ఆయన అందుబాటులో ఎప్పుడూ లేరన్నారు. రెండో దశ ఉద్యమంలోకి వెళ్లేలోపే ప్రభుత్వం స్పందించాలన్నారు. సీఎం స్పందిస్తే తప్ప ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావన్నారు. చట్టబద్ధంగా వేసిన పీఆర్సీ నివేదికను మార్చే అధికారం ఎవరికీ లేదని పీఆర్సీ నివేదికలో చెప్పకూడని అంశాలు ఏమైనా ఉన్నాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Also Read: Sirivennela Live: సీతారాముడూ వెళ్లిపోయాడు.. ఇన్నాళ్లూ వెన్నెల కురింపించి.. నేడు చీకట్లలో వదిలేసి..
ఉద్యోగులు తమ ఉద్యమంలో భాగంగా 7వ తేదీ నుంచి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తారు. 10వ తేదీ మధ్యాహ్నం భోజన విరామంలో నిరసనలు చేస్తారు. 13న తాలూకా, డివిజన్ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతారు. 27 నుంచి విశాఖ, తిరుపతి, ఏలూరు సహా నాలుగు చోట్ల ఉద్యోగులతో ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Also Read: AP Govt OTS : ఏపీలో "ఓటీఎస్" దుమారం ! అసలేంటి ఈ పథకం ? ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి