బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పుడు అందులో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న వారిలో జనాలకు ఇద్దరు, ముగ్గురు మాత్రమే తెలుసు. అందులో యాంకర్ రవి ఒకడు. నోటెడ్ ఫేస్ కావడంతో రవిపై ఫోకస్ ఎక్కువగా ఉండేది. మొదటి నుంచి కూడా ఒక్కడే గేమ్ ఆడుకుంటూ వచ్చాడు. నటరాజ్ మాస్టర్ లాంటి వాళ్లు మెంటల్ గా తనను డిస్టర్బ్ చేసినా.. రవి వాటిని పట్టించుకోకుండా గేమ్ పైనే దృష్టి పెట్టేవాడు. హౌస్ లో ఉన్నవాళ్లకు సలహాలు ఇస్తూ.. మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసేవాడు. 


మొదట్లో లోబోతో చాలా స్నేహంగా ఉండేవాడు. ఆ తరువాత విశ్వా, యానీ మాస్టర్, రవి, శ్రీరామ్, లోబో ఒక గ్రూప్ గా ఏర్పడి గేమ్ ఆడుతూ వచ్చారు. కూతురి మీద బెంగతో రవి కొన్నిరోజులు డల్ అయ్యాడు. రీసెంట్ గా తన ఫ్యామిలీ హౌస్ లోకి రావడంతో రవి తెగ ఆనందపడిపోయాడు. రవి కూతురు వియాను ఏంజిల్ లా చూపించారు బిగ్ బాస్. కూతురిని చూసేశాడు కాబట్టి ఇక రవి గేమ్ పరంగా మరింత ఇంప్రూవ్ అవుతాడని ఆయన అభిమానులు ఆశపడ్డారు. 


హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ లలో రవి ఒకడు. అందరూ అతడు టాప్ 5లో ఉంటాడనే అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అతడిని ఎలిమినేట్ చేసేశారు. ఇప్పటివరకు ప్రసారమైన బిగ్ బాస్ షోల్లో ఇదొక షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. దీంతో రవి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశారు. కావాలనే రవిని ఎలిమినేట్ చేశారని.. ఓట్ల లెక్కలను బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం రవికి తక్కువ ఓట్లు వచ్చాయని చెబుతున్నారు. 


ఇదిలా ఉండగా.. రవి ఎలిమినేషన్ కి సంబంధించిన ఓ వార్త మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. రెమ్యునరేషన్ కారణంగానే రవిని ఇంటి నుంచి బయటకు పంపించేశారట. హౌస్ లో ఉన్న అందరి కంటెస్టెంట్స్ కంటే రవికే ఎక్కువ రెమ్యునరేషన్ చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. వారానికి రూ.6 లక్షల నుంచి 7 లక్షల వరకు ఇస్తున్నారట. ఇప్పటికే అతడు 11 వారాల పాటు హౌస్ లో ఉన్నాడు. ఆ లెక్కన చూసుకుంటే మొత్తం రెమ్యునరేషన్ రూ.75 లక్షలు. 


ప్రైజ్ మనీగా రూ.50 లక్షలతో పాటు పాతిక లక్షలు విలువైన అపార్ట్మెంట్ ఇస్తున్నారు. ఆ మొత్తాన్ని రవి హౌస్ లో పదకొండు వారాలు ఉండే సంపాదించేశారు. ఇక ఫైనల్స్ వరకు అతడిని ఉంచి మరింత రెమ్యునరేషన్ ఇవ్వడంలో అర్ధం లేదని భావించిన బిగ్ బాస్ టీమ్.. అతడిని కావాలనే బయటకు పంపించేశారని టాక్. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ రవి ఎలిమినేషన్ విషయంలో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు.  


Also Read: థియేటర్లు దొరక్క... పదిహేను రోజులు వెనక్కి వెళ్లిన పూర్ణ సినిమా


Also Read: ‘రాధేశ్యామ్’ సాంగ్.. ‘నన్ను ప్రేమిస్తే చస్తావ్’ ఇదో రొమాంటిక్ వార్నింగ్!


Also Read: 'సిరివెన్నెల' సాహిత్యాన్ని విశ్లేషించడమా!? వినడమా!? ఏం చేద్దాం??


Also Read: భీమ్లా నాయక్ పాట విడుదల చేయడం లేదు... ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కూడా


Also Read: నా కంటే రెండు నెలలే పెద్దవాడు.. తనికెళ్ల భరణి కన్నీళ్లు.. ఓదార్చడం త్రివిక్రమ్ వల్ల కూడా కాలేదు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి