పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమాను నుంచి రెండో పాట వచ్చేసింది. అయితే ముందుగా హిందీలో చిత్రీకరించిన ‘ఆషికీ ఆ గయీ’ సాంగ్‌ను బుధవారం విడుదల చేశారు. ప్రభాస్, పూజా హెగ్డేలపై చిత్రీకరించిన ఈ సాంగ్‌ను చూస్తే.. ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతాం. విజువల్‌గా ఈ పాటా చాలా రిచ్‌గా ఉంది. ప్రభాస్, పూజాల లుక్స్ తప్పకుండా అభిమానులను మెస్మరైజ్ చేస్తాయి. 


‘రాధేశ్యామ్’ చిత్రం జనవరి 14న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇటీవల విడుదల చేసిన ‘రాధేశ్యామ్’ టీజర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాలో తొలి పాట ‘ఈ రాతలే..’ కూడా బాగా ట్రెండయ్యింది. ప్రస్తుతం విడుదల చేసిన ‘ఆషికీ ఆ గయూ’ సాంగ్‌ను తెలుగులో ‘నగుమోము తారలే..’గా ఈ పాట విడుదల కానుంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. 


ఇక పాట విషయానికి వస్తే.. ఆరంభంలో ‘‘నిన్ను నువ్వు రోమియో అనుకుంటున్నావా?’’ అని పూజా.. ప్రభాస్‌ను అంటుంది. ‘‘అతడు ప్రేమ కోసం ప్రాణాలిచ్చాడు. కానీ నేను ఆ టైపు కాదు’’ అని ప్రభాస్ అంటాడు. ‘‘కానీ నేను జూలియెట్. నన్ను ప్రేమిస్తే తప్పకుండా చచ్చిపోతావ్’’ అని పూజా అంటుంది. ‘‘కానీ నేను మాత్రం ఫ్లర్టేషన్‌షిప్ (flirtationship) కోరుకుంటున్నా’’ అంటూ.. ప్రభాస్ పూజాను కిస్ చేస్తాడు’’ దీంతో ఈ రొమాంటిక్ పాట మొదలవుతుంది. 



రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్‌, యువీ క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై ప్రమోద్, వంశీ, పరదేశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. యూర‌ప్ నేప‌థ్యంలో జ‌రిగే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. 'జిల్‌' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. దాదాపు మూడు వంద‌ల కోట్ల‌ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.  డిసెంబర్ రెండో వారం, లేదా మూడో వారంలో సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 






Also Read: మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... మహర్షి... సీతారామశాస్త్రి!
Also Read: సిరివెన్నెల రాసిన ఈ రెండు పాటలే చివరివి... ఆర్ఆర్ఆర్‌లో ఆ పాట కూడా...
Also Read: 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి ఇక లేరు.. సాహిత్యానికి ముందు సాధారణ వ్యక్తిగా..
Also Read: సిరివెన్నెల పాట.. ప్రశ్నించే తూటా..
Also Read: వేల పాటలు రాసిన సిరివెన్నెలకు నచ్చిన పాట ఏది? నెటిజన్ల ముచ్చట్లలో ఏం చెప్పారు?


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి