తెలుగు చిత్రసీమలో మరో విషాదం... ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ చనిపోయిన వార్త ఇంకా మరిచిపోకముందే సిరివెన్నెల లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దీంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. సిరివెన్నెల అనారోగ్యంతో నవంబర్ 24 న హైదరాబాద్‌లోకి కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించి నవంబర్ 30 సాయంత్రం మరణించారు. చివరిగా ఆయన కలం నుంచి జాలువారిన పాటలు గురించే ఇప్పుడు అభిమానులు చర్చించుకుంటున్నారు. 

చివరి పాట అదే...సిరివెన్నెల చివరిగా నాని  హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’సినిమాలో రెండు పాటలు రాశారు. ఆ రెండు పాటలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఆ పాటలేంటో తెలుసుకునేందుకు అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక విడుదలైన పాటల్లో చివరిది ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘ఉలికి విలుకాడికి’ అని మొదలయ్యే దోస్తీ సాంగ్. ఈ పాట సినిమా విడుదలకు ముందే హిట్ కొట్టింది. దోస్తీ సాంగ్ మొత్తం స్నేహం గురించి రాసినదే. ఈ పాటను హేమచంద్ర పాడారు. ఈ పాటలోని ప్రతి పదం తెలుగు పాట విలువను పెంచేలా ఉంది. 

ఉలికి విలుకాడికి తలకి ఉరితాడుకికదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకిరవికి మేఘానికి దోస్తీ దోస్తీ

ఊహించని చిత్ర విచిత్రంస్నేహానికి చాచిన హస్తంప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో ఓఓ

దర దందర దందర దం దందర దందర దందర దం దందర దందర దందర దం దందందర దం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తివిధిరాతకి ఎదురీతకి దోస్తిపెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ

దర దందర దందర దం దందర దందర దందర దం దందర దందర దందర దం దందందర దం దం దందం

ఆనుకోని గాలి దుమారంచెరిపింది ఇరుగురి దూరంఉంటారా ఇకపై ఇలాగవైరమే కూరిమయ్నడిచేది ఒకటే దారైవెతికేది మాత్రం వేరైతెగిపోద ఏదో క్షణాన స్నేహమే ద్రోహమైతొందరపడి పడి ఊరకలెత్తేఉప్పెన పరుగులహోముందుగా తెలియదుఎదురు వచ్చే తప్పని మలుపులే ఓఊహించని చిత్ర విచిత్రంస్నేహానికి చాచిన హస్తంప్రాణానికి ప్రయాణం ఇస్తుందో తీస్తుందో

దర దందర దందర దం దందర దందర దందర దం దందర దందర దందర దం దందందర దం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తివిధిరాతకి ఎదురీతకి దోస్తిపెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ

దర దందర దందర దం దందర దందర దందర దం దందర దందర దందర దం దందందర దం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తివిధిరాతకి ఎదురీతకి దోస్తిపెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ

Also read: నాలుగు రోజులుగా సిరివెన్నెల ప్రాణం నిలిచింది ‘ఎక్మో’పైనే... ఎక్మో అంటే? అదెలా ఆయన ప్రాణాలు నిలిపింది?

Also Read: సిరివెన్నెల దృష్టిలో 'క్లిష్టమైన పాట..'Also Read: 'సిరివెన్నెల'కు ముందు సీతారామ శాస్త్రి జీవితం ఇదీ...

Also Read: మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... మహర్షి... సీతారామశాస్త్రి!

Also Read: తొలిపాటకే 'నంది' అందుకున్న సిరివెన్నెల.. రాయడానికి ఎన్నిరోజులు పట్టిందంటే..