నిన్న జరిగిన నామినేషన్ ప్రాసెస్ లో ప్రియాంక.. కాజల్ ని నామినేట్ చేయడం కరెక్ట్ కాదని భావించిన మానస్.. ప్రియాంకతో మాట్లాడానికి ప్రయత్నించాడు. ''నీకు ఎవరు సపోర్ట్ చేశారు పింకీ.. సన్నీ, కాజల్ లు నీకు సపోర్ట్ చేస్తే వెళ్లి ఆమెని నామినేట్ చేశావ్. నువ్ కాజల్ ని ఫ్రెండ్ గా అనుకోలేదు కాబట్టి ఆమెని నామినేట్ చేశావ్. నిన్ను సపోర్ట్ చేయాలనుకుంది కాజల్. ముందు నీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకో పింకీ'' అని చెప్పి లేచి వెళ్లిపోతుండగా.. ''నువ్ చెప్పాలనుకున్నది అయితే వెళ్లిపోతావా..?'' అని ప్రియాంక అడగ్గా.. 'హా వెళ్లిపోతాను' అని మానస్ చెప్పాడు. వెంటనే ప్రియాంక కూడా మానస్ కి దండం పెట్టి 'నువ్వేంటో తెలిసింది' అంటూ వెళ్లిపోయింది.  


ఆ తరువాత మళ్లీ వెళ్లి మానస్ తో ఆర్గ్యూ చేసింది ప్రియాంక. అక్కడే సన్నీ, కాజల్ కూడా ఉన్నారు. 'మనుషులను మనుషుల్లా ట్రీట్ చెయ్..' అంటూ ప్రియాంక డైలాగ్ కొట్టడంతో మానస్ సీరియస్ అయ్యాడు. ''నీ ఒక్క ఫీలింగ్స్ అర్ధం చేసుకొని ఇక్కడ ఎవరూ ఉండరు. నువ్ కావాలనే గొడవ పెట్టుకుంటున్నావ్. నాకు నీతో మాట్లాడాలని లేదు. నీది నువ్ కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి.. నన్ను తప్పు ప్రూవ్ చేస్తున్నావ్. మాట్లాడకు ఇంక నాతో'' అని గట్టిగా చెప్పాడు మానస్. దీంతో ప్రియాంక వెక్కి వెక్కి ఏడ్చేసింది. 


ప్రియాంక తనకు నచ్చినట్లు జనాలుమాట్లాడాలని కోరుకుంటుందని.. ఎంత ఫ్రెండ్లీగా ఉందామన్న నా వల్ల అవ్వట్లేదని మానస్.. కాజల్ తో అన్నాడు. 


ఆ తరువాత కిచెన్ ఏరియాలో మళ్లీ మానస్-ప్రియాంక-సన్నీ-కాజల్ కూర్చొని ఉండగా.. ప్రియాంక మరోసారి వాదించడం మొదలుపెట్టింది. 'ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నారు.. నీకు నచ్చకపోతే మాట్లాడకు' అని కాజల్ అంది. 'నేను మాట్లాడను ఫిక్స్ ఇది' అంటూ మళ్లీ మళ్లీ నొక్కి చెప్పాడు మానస్. 


మానస్-కాజల్ కూర్చొని ఉండగా.. ప్రియాంక అక్కడకి వెళ్లి మానస్ తో మాట్లాడాలని కాజల్ ని పక్కకు వెళ్లమని అడిగింది. దానికి మానస్ వద్దని సైగ చేశాడు. దీంతో కాజల్ కాసేపు అక్కడే కూర్చుంది. ఆ తరువాత లేచి వెళ్తూ.. 'నువ్ అడిగావని నేను వెళ్తున్నా.. మనిషికి స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ పింకీ.. అది నేర్చుకో' అని డైలాగ్ వేసింది కాజల్. వెంటనే ప్రియాంక ఫైర్ అయింది. 'నువ్ నాకెందుకు చెప్తున్నావ్ అసలు..' అంటూ రెచ్చిపోయింది. మానస్ కూడా కాజల్ కే సపోర్ట్ చేయడంతో ప్రియాంక కోపం మరింత ఎక్కువైంది. వెళ్లిపోతూ 'జస్ట్ షటప్' అంటూ కాజల్ ను తిట్టింది.


''కాజల్ కావాలనే ప్రవోక్ చేస్తాది.. అందరూ చెబుతూ ఉంటే ఏదో అనుకున్నా.. ఆమె వెళ్లిపోతే నిజంగానే గొడవలు తగ్గిపోతాయి. మనుషుల్ని బాగా ప్రవోక్ చేస్తాది. రెచ్చగొట్టినట్లు రెచ్చగొట్టి ఏమీ తెలియదన్నట్లు బిహేవ్ చేస్తాది'' అంటూ గట్టిగా గట్టిగా అరుస్తూ మాట్లాడింది. 


ఆ తరువాత మానస్ ''నేనేమైనా తోలు బొమ్మనా..? తను చెప్పినట్లు ఆడడానికి.. తనకు నచ్చినట్లు ఉండట్లేదు కాబట్టి ఇలా గొడవలు పెట్టుకుంటుంది అని'' కాజల్ తో అన్నాడు మానస్. 


ప్రియాంక భోజనం చేయలేదని మానస్ వెళ్లి తినమని అడిగాడు. దానికి ఆమె మళ్లీ ఏదో అంటుండగా.. ''ప్రియా గారు ఉంటే బావుంటుందనిపిస్తుంది.. నీతో మాట్లాడలేకపోతున్నాను నేను'' అని మానస్ అనగా.. వెంటనే ప్రియాంక అతడిని హగ్ చేసుకొని ఎమోషనల్ అయింది.  


తెల్లవారుజామునే కాజల్ కి వెళ్లి సారీ చెప్పింది ప్రియాంక. ''నిన్ను కావాలని అన్ని మాటలు అనలేదు. మానస్ మీద కోపం నీ మీద చూపించేశాను'' అని చెప్పి ఆమెని హగ్ చేసుకుంది.


ఇక ప్రియాంక-షణ్ముఖ్ కూర్చొని కాజల్ గురించి డిస్కషన్ పెట్టుకున్నారు. కాజల్ ఎప్పుడూ నిన్ను ఫ్రెండ్ గా చూడదని, సన్నీతో ఉంటే ఓట్లు పడతాయని అతడితో ఉంటుందని ప్రియాంకతో చెప్పాడు షణ్ముఖ్. 


టికెట్ టు ఫినాలే.. 
టికెట్ టు ఫినాలే గెలుచుకోవడానికి బిగ్ బాస్ ఇచ్చే మూడు ఛాలెంజ్ లలో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ వారికి టికెట్ టు ఫినాలే 
ఎండ్యూరెన్స్ ఛాలెంజ్.. 
ఐస్ ముక్కలతో నింపిన టబ్ మీద ఓపిగ్గా నిలుచుని.. కంటెస్టెంట్స్ కి ఇచ్చే బాల్స్‌ను రక్షించుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ రౌండ్ లో హౌస్ మేట్స్ అందరూ సరదాగా గేమ్ ఆడారు. ఇందులో సెకండ్ రౌండ్ ఉంటుందని బిగ్ బాస్ అనౌన్స్ చేయడంతో ఈరోజు ఎపిసోడ్ కి ఎండ్ కార్డు పడింది. రేపు ఈ గేమ్ కంటిన్యూ అవ్వనుంది. 


Also Read:'ఆయన కలం నేడు ఆగినా.. రాసిన అక్షరాలు నిలిచే ఉంటాయి'


Also Read: 'మాట్లాడుకోవడాల్లేవ్'.. బోయపాటి నిర్ణయం అందుకేనా..?



 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి