బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సన్నీ తన ఆటతీరుతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. మొదట్లో అతడిపై హౌస్ మేట్స్ నెగెటివ్ ఫీలింగ్ తో ఉండేవారు. కానీ సన్నీ గురించి తెలుసుకొని అతడికి దగ్గరవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు హౌస్ లో సన్నీ-మానస్-కాజల్-ప్రియాంక ఒక టీమ్. ఈ నలుగురు కలిసే ఆడుతున్నారు. పైగా ఇప్పుడు షో చివరిదశకు చేరుకోవడంతో ఒక్కొక్కరూ తమ స్ట్రాటజీలను వాడుతున్నారు.
నిజానికి నిన్నమొన్నటివరకు సన్నీ అంటే హౌస్ లో శ్రీరామ్, సిరి, షణ్ముఖ్ ఇలా ఎవరికీ పడేది కాదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరూ కూడా సన్నీను పొగడడం, అతడు టాప్ 5లో ఉంటాడని చెప్పారో.. హౌస్ మేట్స్ అందరూ అలర్ట్ అయిపోయారు. అనవసరంగా సన్నీతో గొడవ పెట్టుకోకూడని చాలా సేఫ్ గా ఆడుతున్నారు. అందుకే నిన్న నామినేషన్స్ లో కూడా అతడిని నామినేట్ చేయలేదు.
ఇప్పటికే హౌస్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కించుకున్నాడు సన్నీ. కానీ అది కాజల్ కి వాడడం, కాజల్ ని జనాలు సేవ్ చేయడంతో.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి సన్నీకే అదృష్టం వరించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ 'టికెట్ టు ఫినాలే' టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం.. ఐస్ ముక్కలతో నింపిన టబ్ మీద ఓపిగ్గా నిలుచుని.. బాల్స్‌ను రక్షించుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో సన్నీ విజేతగా నిలిచి టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడని సమాచారం. దీంతో అతడు నేరుగా టాప్ 5లోకి చేరుకుంటాడు.
ఎక్కువ టైం ఐస్‌లో ఉన్నందుకు స్పర్శ కోల్పోయిన సిరి, శ్రీరామచంద్ర, ప్రియాంక మెడికల్ రూమ్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తానికి సన్నీ మరోసారి తన సత్తా చాటాడు. అతడి జోరు చూస్తుంటే.. బిగ్ బాస్ ట్రోఫీ కూడా అందుకునేలా ఉన్నాడు. మరి బిగ్ బాస్ ఏం డిసైడ్ చేసుకున్నారో..!
Also Read: 'సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి'
Also Read:'ఆయన కలం నేడు ఆగినా.. రాసిన అక్షరాలు నిలిచే ఉంటాయి'
Also Read: 'మాట్లాడుకోవడాల్లేవ్'.. బోయపాటి నిర్ణయం అందుకేనా..?
Also Read: ముందే చెప్పానుగా... గెలవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం, కపిల్ దేవ్‌గా అదరగొట్టిన రణ్‌వీర్, 83 ట్రైలర్ విడుదల