‘బిగ్ బాస్’ సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. ఇప్పుడు ఇంట్లో.. శ్రీరామచంద్ర, సన్నీ, షన్ముఖ్ జస్వంత్, సిరి, కాజల్, ప్రియాంక, మానస్ మాత్రమే ఉన్నారు. వీరిలో షన్ముఖ్, సన్నీ మినహా మిగతావారంతా నామినేషన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్.. ఇంటి సభ్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఫైనల్‌లో స్థానం కోసం ‘టికెట్ టు ఫినాలే’ అవకాశాన్ని కల్పించాడు. ఈ సందర్భంగా వారికి మూడు రకాల టాస్కులు ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. 


మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో టికెట్ టు ఫినాలే ఛాలెంజ్ మొదలుకానుంది. ప్రోమోలో చూపించిన వివరాల ప్రకారం.. బిగ్ బాస్ 5 సీజన్ ఫైనలిస్టు కోసం ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ ఆడాల్సి ఉంటుందని బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ సందర్భంగా మూడు జెండాలు ఏర్పాటు చేశాడు. మూడు టాస్కుల్లో అత్యధిక  పాయింట్లు గెలుచుకొనేవారు.. మొదటి ఫైనలిస్టుగా చేరతారని బిగ్‌ బాస్ ప్రకటించాడు.


టాస్కులో భాగంగా ఐస్ ముక్కలతో నింపిన టబ్ మీద ఓపిగ్గా నిలుచుని.. బాల్స్‌ను రక్షించుకోవాలంటూ ఓ టాస్క్ ఇచ్చాడు. చూస్తుంటే.. ఎవరైతే ఐస్ టబ్ నుంచి బయటకు వచ్చేస్తారో వారు.. మిగతావారిని డిస్ట్రబ్ చేసి.. బాల్స్‌ కిందపడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో తెలియాలంటే.. ఈ రోజు ప్రసారం కానున్న ఎపిసోడ్‌ను చూడాల్సిందే. 






మానస్‌కు చుక్కలు చూపిస్తున్న ప్రియాంక: మరోవైపు ప్రియాంక-మానస్‌ల మధ్య వార్ కొనసాగుతోంది. ఇద్దరు గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకోవడం కనిపించింది. ఈ సందర్భంగా మానస్.. ‘‘నీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకో పింకీ’’ అని చెప్పి లేచి వెళ్లిపోయాడు. ‘‘నేను నీతో మాట్లాడుతున్నా.. నీదైపోతే నువ్వు వెళ్లిపోతావా? చాలా విలువ ఇచ్చావ్ మనుషులకు’’ అని నమస్కారం పెట్టి వెళ్లిపోయింది. ఎందుకు బాధపడతావ్? అని మానస్ గద్దిస్తే.. ‘‘నాకు ఒళ్లు కొవ్వు’’ అని అరిచాడు. ‘‘నువ్వు నాకు నచ్చట్లేదు’’ అని చెప్పేశాడు. చూస్తుంటే.. ఇద్దరి మధ్య పెద్ద వారే జరిగేట్లు ఉంది.


Also Read: ఐసీయూలోనే సిరివెన్నెల.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల..
Also Read: శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి... పాడె మోసిన ఓంకార్
Also Read: నందమూరి కుటుంబంలో మూడు తరాలతో పని చేసిన మాస్టర్!
Also Read: అమిత్ షా మీద జోక్ వేశాడని... ఎక్కడా ఏ జోక్ వేయడానికి వీలు లేకుండా!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి