క్రికెట్ చరిత్రలో 1983వ సంవత్సరం మర్చిపోలేనిది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన టీమిండియా ప్రపంచకప్ ను కొల్లగొట్టి తిరిగి స్వదేశానికి వచ్చింది. ఆ జట్టుకు కెప్టెన్ గా  వ్యవహరించింది కపిల్ దేవ్. ఈ యథార్ధఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘83’. కపిల్ దేవ్‌గా రణ్‌వీర్ సింగ్ నటించారు. ఆయనకు జంట దీపికా పదుకునే నటించింది. కరోనా మహమ్మారి కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను క్రిస్ మస్‌కు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా చిత్రయూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. 3 నిమిషాల 49 సెకన్ల పాటూ సాగే ఈ ట్రైలర్లో మనమందరం 1983 వ ఏడాదికి ఓసారి వెళ్లి వచ్చేస్తాం. 


అదిరిపోయిన డైలాగులు: ట్రైలర్ అంతా భారత జట్టు ప్రయాణం, వారి పడిన మాటలు, కష్టాలు చివరికి వారి గెలుపు వరకు మనల్ని తీసుకెళుతుంది. కొన్ని డైలాగ్‌లకు గూస్‌బంప్స్ రావడం ఖాయం. కపిల్ దేవ్ పెట్టిన ప్రెస్ మీట్ కు నలురైదుగురు విదేశీ ప్రెస్ రిపోర్టర్లు మాత్రమే వస్తారు. అందులో ఒక రిపోర్టర్ ‘మీరేమనుకుంటున్నారు.. మీ టీమ్ వరల్డ్ కప్ గెలిచే అవకాశం ఉందా?’ అని అడుగుతాడు. దానికి కపిల్ ‘మేమిక్కడికి గెలవడానికే వచ్చాం’ అని సమాధానం చెబుతాడు. దానికి ప్రెస్ రిపోర్టర్లంతా ‘ఏంటీ? వరల్డ్ కప్ గెలవడానికా?’ అని నవ్వుతారు. అదే కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిచాక ప్రెస్ మీట్ పెడితే రిపోర్టర్లతో హాలు నిండిపోతుంది. అప్పుడు కపిల్ ‘నేను ముందే చెప్పానుగా... మేమిక్కడికి గెలవడానికే వచ్చాం’ అనగానే హాలు చప్పట్లతో మారుమోగుతుంది. దేశాన్ని ఏకం చేసిన ఆట క్రికెట్ అంటూ ట్రైలర్ చాలా ఇంటెన్సివ్ గా ఉంది. 


ఈ ట్రైలర్ ను కపిల్ పాత్రలో నటించిన హీరో రణ్‌వీర్ సింగ్ షేర్ చేశారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రయూనిట్. కేవలం హిందీలోనే కాదు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళంలో త్రీడీలో విడుదల చేయనున్నారు. కపిల్ దేవ్ భార్య రోమీ దేవ్‌గా రణ్‌వీర్ భార్య దీపికా పదుకునే నటిస్తోంది. నిజ జీవితంలో భార్యాభర్తలు, స్క్రీన్ పై కూడా భార్యాభర్తలుగానే కనిపించడం సినిమాకు ప్లస్ పాయింటే. ఈ సినిమాకు దీపిక సహనిర్మాత కూడా. ఆమెతో పాటూ కబీర్ ఖాన్, విష్ణు వర్ధన్ ఇందూరి, సాజిద్ నాడియవాలా, ఫాంటమ్ ఫిల్మ్స్, రిలయెన్స్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి 83 సినిమాను ప్రొడ్యూస్ చేశారు.


‘83’ తెలుగు ట్రైలర్:  






Also Read: ఐసీయూలోనే సిరివెన్నెల.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల..
Also Read: శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి... పాడె మోసిన ఓంకార్
Also Read: నందమూరి కుటుంబంలో మూడు తరాలతో పని చేసిన మాస్టర్!
Also Read: అమిత్ షా మీద జోక్ వేశాడని... ఎక్కడా ఏ జోక్ వేయడానికి వీలు లేకుండా!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి