శివ శంకర్ మాస్టర్ ఆదివారం రాత్రి తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి ఆయన భౌతిక కాయాన్ని మణికొండలో గల స్వగృహానికి తీసుకువెళ్లారు. హీరో రాజశేఖర్, దర్శక - నిర్మాత, టీవీ హోస్ట్ ఓంకార్, ఆయన తమ్ముడు అశ్విన్ బాబు, 'జబర్దస్త్' ఫేమ్ రాకేష్ తదితరులు నివాళులు అర్పించారు. "నా కెరీర్ ప్రారంభం నుంచి శివ శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఎన్నో సాంగ్స్ చేశాను. ఆయన గొప్ప మాస్టర్. ఆయన మృతి ఇండస్ట్రీకి పెద్ద లోటు" అని రాజశేఖర్ అన్నారు.


సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత శివ శంకర్ మాస్టర్ అంతిమ యాత్ర మొదలైంది. ఓంకార్, అశ్విన్ బాబు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. పాడె మోశారు. శివ శంక‌ర్ మాస్ట‌ర్‌తో ఓంకార్‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కొన్ని టీవీ షోస్ చేశారు. ఓంకార్ దర్శకత్వం వహించిన 'రాజు గారి గది 3'లో శివ శంకర్ మాస్టర్ నటించిన సంగతి తెలిసిందే. ఫిలిం న‌గ‌ర్‌లో గ‌ల‌ మహా ప్రస్థానంలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.


అంత్యక్రియలు జరగడానికి ముందు శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ మీడియాతో మాట్లాడరు. "నాన్నగారి పరిస్థితి తెలిసిన వెంటనే పరిశ్రమ ప్రముఖులు అందరూ ఆయన మీద ప్రేమ చూపించారు. ముఖ్యంగా చిరంజీవి గారు, సోనూ సూద్ గారు, రాఘవా లారెన్స్ మాస్టర్, ధనుష్ గారు, సూర్య గారు, బాబా భాస్కర్ మాస్టర్, జానీ మాస్టర్... ఇంకా చాలా మంది స్పందించారు. సహాయం చేశారు. తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు, తమిళనాడు హెల్త్ మినిస్టర్ సుబ్రమణ్యం గారు నాతో మాట్లాడారు. మా కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు.  మాపై ఎంతో ప్రేమ చూపించారు. మేం అన్ని ప్రయత్నాలు చేశాం. ఆయన్ను బతికించాలని డాక్టర్లు చాలా ప్రయత్నం చేశారు. అందరికీ పేరు పేరునా థాంక్స్" అని అన్నారు.
Also Read: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక...  సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!
శివ శంకర్ మాస్టర్ మృతి పట్ల చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, రాజమౌళి, సోనూ సూద్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 



Also Read: రకుల్ హిందీ సినిమా టైటిల్ మారింది... అంతా అజయ్ దేవగణే చేశారు!
Also Read: బాలకృష్ణ ముందు డైలాగులు చెప్పడానికి భయపడ్డా! కానీ...
Also Read: నందమూరి కుటుంబంలో మూడు తరాలతో పని చేసిన మాస్టర్!
Also Read: అమిత్ షా మీద జోక్ వేశాడని... ఎక్కడా ఏ జోక్ వేయడానికి వీలు లేకుండా!
Also Read: పుష్ప సెట్‌కు వ‌చ్చిన స‌మంత‌... అల్లు అర్జున్‌తో స్పెష‌ల్ సాంగ్ షురూ!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి