ఓ కలం శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది. తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు మిగిల్చింది. 'సిరివెన్నెల' మరణంతో తెలుగు సాహితీ ప్రపంచమే కాదు... సినిమా పరిశ్రమ శోక సంద్రంలో మునిగింది. ప్రతి మనిషికి మరణం తథ్యమని తెలిసినా... మౌనంగా వచ్చే కన్నీళ్లను, మనసులో బాధను ప్రముఖులు ఇలా వెల్లడిస్తున్నారు.
'సిరివెన్నెల' మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు - చిరంజీవి
సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల గారు - నందమూరి బాలకృష్ణ
సాహిత్య శిఖరం నేలకొరిగింది - మోహన్ బాబు
ట్విట్టర్ వేదికగా సిరివెన్నెల సీతారామశాస్త్రి నివాళులు అర్పించారు ఎన్టీఆర్. ''సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను'' అంటూ రాసుకొచ్చారాయన.
చుక్కల్లారా... చూపుల్లారా... ఎక్కడమ్మా జాబిలి? - ఎం.ఎం. కీరవాణి
ఆర్ఆర్ఆర్, సైరా కోసం ఆయన చెప్పిన మాటలు నాకెప్పటికీ గుర్తు ఉంటాయి - రామ్ చరణ్
'సిరివెన్నెల' తెలుగు సాహిత్య శిఖరం - దర్శకుడు అనిల్ రావిపూడి
కను మూసిన తరువాతనే.. పెను చీకటి చెబుతుందా! - దర్శకుడు గోపీచంద్ మలినేని
తెలుగు భాష 'సిరివెన్నెల'ను కోల్పోయింది - దర్శకుడు మెహర్ రమేష్
పదాలు మూగబోయాయి - దర్శకుడు సతీష్ వేగేశ్న
సిరివెన్నెల గారూ... పరిశ్రమకు మీరు అందించిన సేవలకు థాంక్యూ! మీరు ఎప్పటికీ గుర్తుంటారు. మిమ్మల్ని ఎప్పటికీ మరువలేం. మీతో పని చేసినందుకు గర్వంగా ఉంది - హీరో రామ్
ఆయన సాహిత్యంలోని సిరివెన్నెల మన మనసుల మీద ఎప్పటికీ అలానే ఉంటుంది - హీరో నాని
వచనం మధురం... లిఖితం మనోహరం - సితార ఎంటర్టైన్మెంట్స్
మాటలు రావడం లేదు! - సాయి తేజ్
సిరివెన్నెల మరణంతో తనకు మాటలు రావడం లేదని హీరో సాయి తేజ్ అన్నారు. 'గొప్ప లెజెండ్'ను కోల్పోయామని ఆయన పేర్కొన్నారు.
మీ సూక్తులు మేము రాసుకొనే మాటలు...
బ్రహ్మ ఒక్కడే కష్టపడుతున్నాడని సాయంగా ఇంత తొందరగా వెళ్లిపోయారా? నా పాట పూర్తి చేసి వెళ్లిపోయారు. కానీ, పాఠం మధ్యలోనే వదిలేసారు గురూజీ. భరించలేని నిజం చెవులు వింటున్నాయి. కానీ, మనసు ఒప్పుకోవటం లేదు" అని దర్శకుడు మారుతి ట్వీట్ చేశారు.