'రాధే శ్యామ్' సినిమాలో రెండో పాటను ఈ రోజు (బుధవారం, డిసెంబర్ 1) విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, విడుదల చేయలేదు. దివంగత గేయ రచయిత 'సిరివెన్నెల'కు నివాళిగా, ఆయనపై గౌరవంతో సెకండ్ సాంగ్ రిలీజ్ చేయడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సంస్థ పేర్కొంది. గురువారం ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తామని తెలియజేసింది. ఈ రోజు ఉదయం 'భీమ్లా నాయక్' సినిమా నుంచి 'అడివి తల్లి మాట...' పాటను కూడా విడుదల చేయాలని అన్నారు. 'సిరివెన్నెల' తిరిగి రాని లోకాలకు వెళ్లిన నేపథ్యంలో వాయిదా వేశారు. డిసెంబర్ 3న (గురువారం) అనుకున్న 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్‌ను కూడా విడుదల చేయాలని అనుకున్నారు. 'సిరివెన్నెల'కు నివాళిగా విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. 'భీమ్లా నాయక్', 'ఆర్ఆర్ఆర్' బాటలో 'రాధే శ్యామ్' బృందం కూడా నడిచింది.





'రాధే శ్యామ్' సినిమాలో రెండో పాట 'నగుమోము తారలే...'ను సిద్ శ్రీరామ్ పాడారు. తెలుగు సహా మిగతా దక్షిణాది భాషలు తమిళ్, మలయాళం, కన్నడలో గురువారం విడుదల చేయనున్నారు. ఈ పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. అయితే... 'రాధే శ్యామ్' హిందీ వెర్షన్‌ సాంగ్ 'ఆషికీ ఆ గయీ'ను మాత్రం ఈ రోజు ఉదయం విడుదల చేశారు. దానికి మిథూన్ సంగీతం, సాహిత్యం అందించారు. అర్జిత్ సింగ్‌తో క‌లిసి ఆయనే పాట పాడారు. ఈ పాట మీద ఆల్రెడీ ట్రోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సాంగ్ మధ్యలో కొన్ని షాట్స్‌లో  పూజా హెగ్డే బదులు ప్రభాస్ వెనుక బండి మీద వేరే అమ్మాయి కూర్చున్నారని ట్రోల్ చేస్తున్నారు. 

Also Read: వరద బాధితులకు ఎన్టీఆర్ సాయం.. ఫ్యూచర్ సీఎం అంటూ కామెంట్స్..
Also Read: ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు కృతజ్ఞతలు చెప్పిన 'సిరివెన్నెల' కుటుంబం
Also Read: 'సిరివెన్నెల' సాహిత్యాన్ని విశ్లేషించడమా!? వినడమా!? ఏం చేద్దాం??
Also Read: 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి ఇక లేరు.. సాహిత్యానికి ముందు సాధారణ వ్యక్తిగా..
Also Read: సీతారాముడూ.. నిన్ను గుర్తు చేసుకుంటూ బతికేస్తాం, పోయిరా నేస్తం.!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి