ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం సికింద్రాబాద్ కిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందనే విషయం బయటకు వచ్చింది. ఆ ఉదయం పదకొండు గంటలకు సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని దివంగత గేయ రచయిత కుటుంబ సభ్యులు తెలియజేశారు. అలాగే, ఆసుపత్రి ఖర్చులన్ని భరించమని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించినట్టు వారు తెలిపారు.
మంగళవారం (నవంబర్ 30న) సాయంత్రం నాలుగు గంటలకు 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి స్వర్గస్తులు అయ్యారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. 'సిరివెన్నెల' అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రివర్యులు హాజరై, ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తూ.. మేము కట్టిన అడ్వాన్స్‌ని కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని 'సిరివెన్నెల' పెద్ద కుమారుడు సాయి యోగేశ్వర్, ఇతర కుటుంబ సభ్యులు తెలియజేశారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన ఏపీ సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు.
Also Read: 'సిరివెన్నెల' సాహిత్యాన్ని విశ్లేషించడమా!? వినడమా!? ఏం చేద్దాం??
సిరివెన్నెల అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో గ‌ల‌ మహాప్రస్థానంలో ముగిశాయి. ఆయన పెద్ద కుమారుడు సాయి వెంకట యోగేశ్వర శర్మ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు ఫిల్మ్ నగర్‌లో గ‌ల ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శన కోసం 'సిరివెన్నెల' భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,  మహేష్ బాబు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజశేఖర్ - జీవిత దంపతులు సహా పలువురు సినీ ప్రముఖులు... ఏపీ మంత్రి పేర్ని నాని, తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు తదితర రాజకీయ ప్రముఖులు 'సిరివెన్నెల'కు నివాళులు అర్పించారు.



Also Read: 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి ఇక లేరు.. సాహిత్యానికి ముందు సాధారణ వ్యక్తిగా..
Also Read: సీతారాముడూ.. నిన్ను గుర్తు చేసుకుంటూ బతికేస్తాం, పోయిరా నేస్తం.!
Also Read: తెలుగు అక్షరానికి పాటలతో స్వరాభిషేకం చేసిన సిరివెన్నెలకు ఇదే సిని"మా" నివాళి
Also Read: నా కంటే రెండు నెలలే పెద్దవాడు.. తనికెళ్ల భరణి కన్నీళ్లు.. ఓదార్చడం త్రివిక్రమ్ వల్ల కూడా కాలేదు!
Also Read: 'సిరివెన్నెల' కోసం అయ్యప్పమాల తీసి మరీ వచ్చిన చిరంజీవి... ఆస్పత్రిలో చేరడానికి ముందు ఫోనులో మాట్లాడగా!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి