Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థీవదేహానికి నివాళులు అర్పించేందుకు రచయిత, నటుడు తనికెళ్ల భరణి బుధవారం ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చారు. సిరివెన్నెల పార్థీవదేహాన్ని చూస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. సిరివెన్నెల సతీమణిని తనికెళ్ల భరణి పరామర్శించారు. ఆమెను ఓదార్చే సమయంలోనూ ఆయనకు కన్నీళ్లు ఆగలేదంటే.. వారి మధ్య అనుబంధం, అప్యాయతకు ఇది నిదర్శనమని చెప్పవచ్చు. డైరెక్టర్ త్రివిక్రమ్ సైతం ఓదార్చే ప్రయత్నం చేయగా.. కౌగిలించుకుని కన్నీటి పర్యంతమయ్యారు భరణి.
మేం ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. స్రవంతి మూవీస్ మాకు వేదిక అన్నారు. స్రవంతి మూవీస్ లో ఎన్నో సినిమాలకు కలిసి పనిచేశామన్నారు. అక్కడే ఎన్నో రోజులు నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయని.. తనకంటే కేవలం రెండు నెలలే పెద్దవాడని సీతారామశాస్త్రి గురించి చెప్పారు. తనను ఎంతో అప్యాయంగా పలకరించేవాడంటూ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పటి నుంచి వారి కుటుంబంతో తాను టచ్‌లోనే ఉన్నానని చెప్పారు. ఒక్క వట వృక్షం కూలిపోయింది. అంతా శూన్యమంటూ వేదాంతం మాట్లాడారు.
సిరివెన్నెల మరణం టాలీవుడ్‌కు తీరని లోటు అని నటుడు రావు రమేష్ అన్నారు. గొప్ప సరస్వతీ పుత్రుడిని కోల్పోయాం అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి అంత అనుభవం, భాష తనకు రాదన్నారు. తన తొలి సినిమా గమ్యం సినిమా తీసిన తరువాత చెన్నైలో ఉన్నప్పుడు క్రిష్ కాల్ చేసి.. మీ నాన్నగారి పేరు నిలబెట్టావని ప్రశంసించారు. కానీ అప్పుడు ఆ మాటలు నమ్మలేకపోయాను. రాజీ పడకుండా పనిచేయాలని ఆరోజు నేర్చుకున్నానని చెప్పారు. సిరివెన్నెల సైతం తన సాహిత్యంలో రాజీ పడకుండా ఎన్నో విలువైన పాటల్ని తెలుగు ప్రేక్షకులకు అందించారని ఆయన సేవల్ని కొనియాడారు.
Also Read: మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... మహర్షి... సీతారామశాస్త్రి!
అనారోగ్య సమస్యలతో ఇటీవల కిమ్స్ ఆస్పత్రిలో చేరిన 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఈ నెల 22న ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన కోలుకుంటారని, మరెన్నో పాటలు తమకు అందిస్తారని ఆశించిన తెలుగువారికి సిరివెన్నెల మరణం విషాదకరం.. నేటి మధ్యాహ్నం మహా ప్రస్థానంలో సిరివెన్నెల అంతిమ సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Also Read: సిరివెన్నెల రాసిన ఈ రెండు పాటలే చివరివి... ఆర్ఆర్ఆర్‌లో ఆ పాట కూడా...
Also Read: వేల పాటలు రాసిన సిరివెన్నెలకు నచ్చిన పాట ఏది? నెటిజన్ల ముచ్చట్లలో ఏం చెప్పారు?