ఐపీఎల్‌లో మరో కీలక ఘట్టం ముగిసింది. ఆటగాళ్ల రిటెన్షన్‌కు, దానికి సంబంధించిన సంప్రదింపులకు బీసీసీఐ ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో జట్లు తాము రిటైన్ చేసుకున్న ప్లేయర్ల జాబితాను వెల్లడించారు. ఇక సన్‌రైజర్స్ విషయానికి వస్తే.. కథను సన్‌రైజర్స్ మళ్లీ మొదటికి తీసుకువచ్చింది. జట్టును మళ్లీ 0 నుంచి నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది.
అవును.. రైజర్స్ బృందం కెప్టెన్ కేన్ విలియమ్సన్, అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అబ్దుల్ సమద్, ఉమ్రన్ మలిక్‌లను మాత్రమే రిటైన్ చేసింది. సరిగ్గా సంవత్సరం ముందు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, రషీద్ ఖాన్, నబీ, కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లతో వెలిగిపోయిన్ సన్‌రైజర్స్‌కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? స్వయంకృతాపరాధమా? ఆటగాళ్ల నిర్ణయాలు కారణమా?
ఇక్కడ మొదట చెప్పుకోవాల్సింది డేవిడ్ వార్నర్ గురించి. వార్నర్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే వార్నర్.. అనే పరిస్థితి నుంచి ‘మీకో దండం నాయనా’ అని వార్నర్ అనేలా చేసుకోవడానికి కారణం సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ప్రవర్తనే కారణం. ఒక్క సీజన్ కూడా కాదు... కేవలం ఏడు మ్యాచ్‌ల వైఫల్యానికే వార్నర్‌ను బాధ్యుడిని చేసి కెప్టెన్సీ నుంచి తప్పించడం, జట్టులో ఆటగాడిగా కూడా స్థానం ఇవ్వకపోవడం వంటివి వార్నర్‌ను బాధించాయి. దీంతో వార్నర్ రైజర్స్‌ను వదలడానికి నిర్ణయించుకున్నాడు.
ఇక రషీద్ ఖాన్‌ది మరో కథ. రషీద్ ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు మొదటి రిటెన్షన్‌గా ఉండాలనుకున్నాడు. మొదటి రిటెన్షన్ ఆటగాడికి రూ.16 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. సన్‌రైజర్స్ రూ.14 కోట్లు చెల్లించి కేన్ విలియమ్సన్‌ను మొదటి రిటెన్షన్‌గా ఉంచుకోవడానికి మొగ్గు చూపింది. దీంతో రషీద్ కూడా వెళ్లిపోయాడు.
జానీ బెయిర్‌స్టోని స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా ఉంచుకునే అవకాశం ఉంది. కానీ రైజర్స్ ఎందుకో ఆ ప్రయత్నం చేయలేదు. బహుశా నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌ల్లో ఒకరిని వేలంలో కొనుగోలు చేసే ఆలోచనలో ఉందేమో తెలియాల్సి ఉంది. భువనేశ్వర్ తరచుగా గాయాల పాలవుతూ ఉండటం, ఇటీవల అంత ప్రభావం చూపకపోవడంతో తనని కూడా రైజర్స్ యాజమాన్యం పరిగణనలోకి తీసుకోలేదు.
ఇప్పుడు సన్‌రైజర్స్ ముందు చాలా పెద్ద టాస్కే ఉంది. జట్టును మళ్లీ బిల్డ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ప్రస్తుతం రైజర్స్ దగ్గర వేలంలో ఖర్చు పెట్టడానికి ఏకంగా రూ.68 కోట్లు ఉన్నాయి. గత వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకుని ఈసారి అయినా వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రైజర్స్ దగ్గర మంచి కెప్టెన్ ఉన్నాడు. అతని చేతిలో సరైన టీంను పెట్టి.. జట్టు వ్యూహాల్లో భాగస్వామిని చేస్తే.. మళ్లీ పునర్‌వైభవం పొందవచ్చు.
Also Read: ఐపీఎల్ 2022 రిటెన్షన్ లిస్ట్ ఇదే.. ఏయే జట్లలో ఎవరున్నారు.. రైజర్స్ ఎంచుకున్న ముగ్గురు ఎవరు?
Also Read: Sri Lankan Women Cricketers: శ్రీలంక క్రికెట్‌లో కలకలం... ఆరుగురు మహిళా ఆటగాళ్లకు పాజిటివ్
Also Read: Ahmedabad Franchise: అహ్మదాబాద్.. ఇలా అయితే ఎలా.. ఐపీఎల్ 2022లో కష్టమే!
Also Read: CSK in IPL: చెన్నై సూపర్‌కింగ్స్‌కు కొత్త స్పాన్సర్.. ఎన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ అంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి