IPL Retention 2022: ఐపీఎల్ 2022 రిటెన్షన్ లిస్ట్ ఇదే.. ఏయే జట్లలో ఎవరున్నారు.. రైజర్స్ ఎంచుకున్న ముగ్గురు ఎవరు?

ఐపీఎల్ జట్లన్నీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఏయే జట్లు ఎవరిని ఎంచుకున్నాయంటే?

Continues below advertisement

ఐపీఎల్ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఐపీఎల్ జట్లు ఎవరిని రిటైన్ చేస్తున్నాయో అధికారికంగా ప్రకటించాయి. ఇప్పటివరకు ఏయే జట్లు ఎవరిని రిటైన్ చేస్తున్నారో అని రకరకాల కథనాలు, రకరకాల ఊహాగానాలు వినిపించాయి. 

Continues below advertisement

వీటన్నిటికీ ఇప్పుడు తెరపడింది. ఏయే జట్లు ఎవరిని రిటైన్ చేసుకున్నాయో కిందనున్న జాబితాలో చూడండి:

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
1. విరాట్ కోహ్లీ - రూ.15 కోట్లు
2. గ్లెన్ మ్యాక్స్‌వెల్ - రూ.11 కోట్లు
3. మహ్మద్ సిరాజ్ - రూ.7 కోట్లు

వేలానికి మిగిలిన డబ్బు రూ.57 కోట్లు. ఆశ్చర్యకరంగా 2021 సీజన్‌లో పర్పుల్ క్యాప్ సాధించిన హర్షల్ పటేల్, ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్‌లను బెంగళూరు రిటైన్ చేయలేదు.

ముంబై ఇండియన్స్
1. రోహిత్ శర్మ  - రూ.16 కోట్లు
2. జస్‌ప్రీత్ బుమ్రా - రూ.12 కోట్లు
3. సూర్యకుమార్ యాదవ్ - రూ.8 కోట్లు
4. కీరన్ పొలార్డ్ - రూ.6 కోట్లు

వేలానికి మిగిలిన డబ్బు రూ.48 కోట్లు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌ల్లో ఎవరిని తీసుకుంటారు అనే విషయంలో కాస్త సస్పెన్స్ నెలకొన్నప్పటికీ.. సూర్యకుమార్ వైపు ముంబై యాజమాన్యం మొగ్గు చూపింది.

పంజాబ్ కింగ్స్
1. మయాంక్ అగర్వాల్ - రూ.14 కోట్లు
2. అర్ష్‌దీప్ సింగ్ (అన్‌క్యాప్డ్) - రూ.4 కోట్లు

వేలానికి మిగిలిన డబ్బు రూ.72 కోట్లు. కేఎల్ రాహుల్ కొత్త ఫ్రాంచైజీకి వెళ్లిపోతాడని ముందు నుంచే వార్తలు వినిపించాయి. పంజాబ్ యాజమాన్యం రాహుల్‌ని రిటైన్ చేసుకోవాలి అనుకున్నా.. జట్టును వదలడానికే తను నిర్ణయించుకున్నాడని అనిల్ కుంబ్లే తెలిపారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్
1. కేన్ విలియమ్సన్ - రూ.14 కోట్లు
2. అబ్దుల్ సమద్ (అన్‌క్యాప్డ్) - రూ.4 కోట్లు
3. ఉమ్రన్ మాలిక్ (అన్‌క్యాప్డ్) - రూ.4 కోట్లు

వేలానికి మిగిలిన డబ్బు రూ.68 కోట్లు. డేవిడ్ వార్నర్‌ని రైజర్స్ వదిలేయగా, రషీద్ ఖాన్ తనంతట తనే జట్టు నుంచి వెళ్లిపోయాడు. రషీద్ తను మొదటి రిటెన్షన్‌గా ఉండాలనుకున్నాడు. కానీ జట్టు మాత్రం కేన్ విలియమ్సన్‌ను మొదటి రిటెన్షన్‌గా తీసుకున్నారు. ఈ సమీకరణాలు కుదరకపోవడంతో రషీద్ జట్టును వీడాడు.

చెన్నై సూపర్ కింగ్స్
1. రవీంద్ర జడేజా - రూ.16 కోట్లు
2. మహేంద్ర సింగ్ ధోని - రూ.12 కోట్లు
3. మొయిన్ అలీ - రూ.8 కోట్లు
4. రుతురాజ్ గైక్వాడ్ - రూ.6 కోట్లు

వేలానికి మిగిలిన డబ్బు రూ.48 కోట్లు. ఆశ్చర్యకరంగా రవీంద్ర జడేజాని మొదటి రిటెన్షన్‌గా చెన్నై ఎంచుకుంది. ధోని రెండో రిటెన్షన్‌గా ఉన్నాడు. మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌లను కూడా రిటైన్ చేశారు. అయితే నాలుగు ఆప్షన్లే ఉన్నాయి కాబట్టి సురేష్ రైనా, రాయుడు, శామ్ కరన్, ఫాఫ్ డుఫ్లెసిస్, డ్వేన్ బ్రేవో వంటి ఆటగాళ్లను వదిలేయాల్సి వచ్చింది. వీరిని వేలంలో చెన్నై తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్
1. రిషబ్ పంత్ - రూ.16 కోట్లు
2. అక్షర్ పటేల్ - రూ.9 కోట్లు
3. పృథ్వీ షా  - రూ.7.5 కోట్లు
4. ఆన్రిచ్ నోర్జే - రూ.6.5 కోట్లు

వేలానికి మిగిలిన డబ్బు రూ.51 కోట్లు. శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్,  రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడ వంటి ఆటగాళ్లు వేలంలోకి వెళ్లిపోయారు. 

కోల్‌కతా నైట్‌రైడర్స్
1. ఆండ్రీ రసెల్ - రూ.12 కోట్లు
2. వరుణ్ చక్రవర్తి - రూ.8 కోట్లు
3. వెంకటేష్ అయ్యర్ - రూ.8 కోట్లు
4. సునీల్ నరైన్ - రూ.6 కోట్లు

వేలానికి మిగిలిన డబ్బు రూ.51 కోట్లు. ప్రస్తుత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను రైడర్స్ వదిలేశారు. శుభ్‌మన్ గిల్, శివం మావి, ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీష్ రాణా, దినేష్ కార్తీక్, షకీబ్ అల్ హసన్, లోకి ఫెర్గూసన్ కూడా జట్టులో అందుబాటులో ఉన్నారు.

రాజస్తాన్ రాయల్స్
1. సంజు శామ్సన్ - రూ.14 కోట్లు
2. జోస్ బట్లర్ - రూ.10 కోట్లు
3. యశస్వి జైస్వాల్(అన్‌క్యాప్డ్) - రూ.4 కోట్లు

వేలానికి మిగిలిన డబ్బు రూ.62 కోట్లు. విదేశీ స్టార్ ప్లేయర్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ మోరిస్, ముస్తాఫిజుర్, లియాం లివింగ్ స్టోన్ వేలంలోకి వెళ్లిపోయారు. వీళ్లతో పాటు భారతీయ ఆటగాళ్లు రాహుల్ టెవాటియా, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగి, రియాన్ పరాగ్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ వంటి ప్లేయర్లు కూడా మిగతా జట్లకు అందుబాటులో ఉన్నారు.

Also Read: Sri Lankan Women Cricketers: శ్రీలంక క్రికెట్‌లో కలకలం... ఆరుగురు మహిళా ఆటగాళ్లకు పాజిటివ్‌

Also Read: IND vs NZ 1st Test: ఫలితాన్ని ‘రచిన్’చాడు.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు!

Also Read: Ahmedabad Franchise: అహ్మదాబాద్.. ఇలా అయితే ఎలా.. ఐపీఎల్ 2022లో కష్టమే!

Also Read: CSK in IPL: చెన్నై సూపర్‌కింగ్స్‌కు కొత్త స్పాన్సర్.. ఎన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ అంటే?

Also Read: WTC Points Table 2021-2023: టెస్టు చాంపియన్‌షిప్ రేసు మొదలైంది... పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో టీమిండియా.. టాప్ ఎవరంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Continues below advertisement
Sponsored Links by Taboola