భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. 4/1 ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ పరుగులకు ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ టామ్ లాథమ్ (52: 146 బంతుల్లో, మూడు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 


284 పరుగుల లక్ష్యంతో బరిలోకి న్యూజిలాండ్ నాలుగో రోజు చివర్లో మొదటి వికెట్ కోల్పోయింది. అయితే ఐదోరోజును ఆ జట్టు మెరుగ్గానే ప్రారంభించింది. మొదటి  ఓపెనర్ టామ్ లాథమ్, వన్‌డౌన్‌లో వచ్చిన విలియమ్ సోమర్‌విల్లే (36: 110 బంతుల్లో, ఐదు ఫోర్లు) వికెట్ ఇవ్వకుండా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 76 పరుగులు జోడించారు.


రెండో సెషన్ మొదటి బంతికే విలియమ్‌ను అవుట్ చేసి ఉమేశ్ యాదవ్ భారత్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వికెట్లు వరుసగా పడుతూనే ఉన్నాయి. రాస్ టేలర్ (2: 24 బంతుల్లో), హెన్రీ నికోల్స్ (1: 4 బంతుల్లో), టామ్ బ్లండెల్ (2: 38 బంతుల్లో) విఫలం అయ్యారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (24: 112 బంతుల్లో, మూడు ఫోర్లు) భారత బౌలర్లను కాసేపు అడ్డుకున్నాడు. అయితే తను కూడా ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. చివర్లో భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్ర (18 నాటౌట్: 91 బంతుల్లో, రెండు ఫోర్లు), 11వ నంబర్ ఆటగాడు అజాజ్ పటేల్ (2 నాటౌట్: 23 బంతుల్లో) తొమ్మిది ఓవర్ల పాటు వికెట్ పడకుండా అడ్డుకుని.. మ్యాచ్ డ్రాగా ముగించారు.


మ్యాచ్ చివరి రోజు స్పిన్నర్లు పూర్తిగా డామినేట్ చేశారు. కివీస్ నాలుగో ఇన్నింగ్స్‌లో కోల్పోయిన మొత్తం తొమ్మిది వికెట్లలో ఒక వికెట్ మాత్రమే పేసర్‌కు దక్కింది. మిగిలిన తొమ్మిది వికెట్లు స్పిన్నర్లకే దక్కాయి. రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు, అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్‌లకు చెరో వికెట్ దక్కింది. ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు డిసెంబర్ 3వ తేదీ నుంచి జరగనుంది.







Also Read: IND vs NZ Kanpur Test: యాష్‌ నువ్వే భేష్‌..! బ్యాటర్ల బుర్రల్లో చిక్కుముళ్లు వేశావన్న వెటోరీ


Also Read: Kapil Dev: ముందు పాండ్యను బౌలింగ్‌ చేయనివ్వండి..! నా వరకైతే అశ్వినే మెరుగైన ఆల్‌రౌండర్‌


Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్‌ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?


Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్‌ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్‌ ప్లేయర్‌


Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి