ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం 'రాధే శ్యామ్'. ఇందులోని తొలి పాట 'ఈ రాతలే...'ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఇప్పుడు రెండో సాంగ్ టీజర్ విడుదల చేశారు. డిసెంబర్ 1న ఫుల్ సాంగ్ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం హిందీ వెర్షన్ సాంగ్ రిలీజ్ చేశారు. రాత్రి 7 గంటలకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం... దక్షిణాది భాషల్లో సాంగ్ టీజర్ విడుదల చేయనున్నారు. ఈ హిందీ పాటకు మిథూన్ సంగీతం, సాహిత్యం అందించారు. తెలుగులో 'నగుమోము తారలే...'గా ఈ పాట విడుదల కానుంది.
సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించారు. Aashiqui Aa Gayi Teaser: