ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి ఇండియన్స్‌. ఆ జట్టు తీసుకుంటుందంటే ఆటగాళ్లు ఎగిరి గంతేస్తారు. అలాంటి ఓ క్రికెటర్‌ మాత్రం వారి నుంచి విడిపోయేందుకే మొగ్గు చూపుతున్నాడని తెలిసింది.


ఐపీఎల్‌ మెగావేలం డిసెంబర్లో జరగనుంది. ఈ లోపు ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను తీసుకొనేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. అయితే అధికారికంగా వివరాలేమీ వెల్లడించలేదు. కాగా రీటెయిన్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు నవంబర్‌ 30 ఆఖరు తేదీగా చెబుతున్నారు.


ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సీనియర్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌, సీనియర్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను తీసుకోవడం పక్కా అని తెలిసిందే! అయితే యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ను నాలుగో ఆటగాడిగా ముంబయి తీసుకుంటోందని అంటున్నారు. మిడిలార్డర్‌లో కీలకమైన సూర్యకుమార్‌ యాదవ్‌ను వేలంలో భారీ ధర పెట్టి దక్కించుకుంటామని చెప్పిందట. అందుకు సూర్య అంగీకరించడం లేదని తెలుస్తోంది.


ఐదు సార్లు ఛాంపియన్‌ జట్టుతో బంధం తెంచుకొనేందుకు సూర్యకుమార్‌ సిద్ధమయ్యాడని సమాచారం. మరో ఫ్రాంచైజీ అతడికి ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిందని తెలుస్తోంది. అందుకు అతడూ అంగీకరించాడట. సూర్య ఏ స్థానంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలడు. జట్టు స్కోరు వేగం పెంచాలంటే పెంచగలడు. వికెట్లు పడకుండా పరుగులు చేయగలడు. మొదట కోల్‌కతాకు ఆడిన అతడు తర్వాత ముంబయికి వచ్చాడు. ఆ జట్టు తరఫున 1733 పరుగులు చేశాడు. అందుకే అతడికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది.


పంజాబ్ కింగ్స్ సారథి కేఎల్ రాహుల్ సైతం జట్టును వీడుతున్న సంగతి తెలిసిందే. భారీ మొత్తానికి అతడిని లఖ్ నవూ ఫ్రాంచైజీ తీసుకుంటోందని వార్తలు వస్తున్నాయి.


Also Read: Test Match Records: 23 ఏళ్లకే శుభ్‌మన్‌ అరుదైన రికార్డు.. సన్నీకి చేరువ అవుతాడా?


Also Read: IPL 2022 Auction: పంజాబ్‌కు రాహుల్‌ షాక్‌..! మోర్గాన్‌, డీకేను వదిలేస్తున్న కోల్‌కతా!


Also Read: Shreyas Iyer Test Debut: వాహ్.. అరంగేట్రంలోనే అదరగొట్టావుగా.. శ్రేయస్‌పై సోషల్‌మీడియా ప్రశంసలు!


Also Read: Bhuvneshwar Kumar Became Father: భువీకి ఆడపిల్ల.. ఈ సంవత్సరం భారత పేసర్‌కు మొదటి గుడ్‌న్యూస్!


Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?


Also Read: 83 Teaser: ‘83’ మూవీ టీజర్.. వచ్చేస్తోంది వరల్డ్ కప్ హిస్టరీ.. హిట్ పక్కా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి