ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఇటీవలే యూఏఈలో జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్ జరగడం, పొట్టి ఫార్మాట్‌కు విపరీతమైన ఫ్యాన్స్ ఉండటంతో ఈ సిరీస్‌ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సిరీస్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అయితే మరిన్ని రికార్డులు బద్దలుకొట్టింది. ఎక్కువ మంది చూసిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌గా ఈ మ్యాచ్ నిలిచింది.


భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు స్టార్ ఇండియా నెట్‌వర్క్‌లో ఏకంగా 16.7 కోట్ల టెలివిజన్ రీచ్ లభించింది. మొత్తంగా 1,590 కోట్ల నిమిషాల వ్యూయర్‌షిప్ ఈ మ్యాచ్‌కు లభించింది. గతంలో ఈ రికార్డు 2016 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్ పేరిట ఉండేది.


ఈ టోర్నీలో భారత్ సూపర్ 12 దశలోనే వెనుదిరిగినప్పటికీ.. ఏకంగా 11,200 కోట్ల నిమిషాల వ్యూయర్ షిప్ మనదేశంలో టీ20 వరల్డ్‌కప్‌కు లభించింది. 15 సంవత్సరాల లోపు ఉన్న వారు ఇందులో 18.5 శాతం సమయం చూశారని, దీన్ని బట్టి భవిష్యత్తులో కూడా మనదేశంలో క్రికెట్‌కు మంచి వ్యూయర్ షిప్ లభించనుందని అనుకోవచ్చు.


దీంతోపాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఈ టోర్నమెంట్‌కు బీభత్సమైన వ్యూయర్ షిప్ లభించింది. యునైటెడ్ కింగ్‌డంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టెలికాస్ట్ చేసిన స్కై యూకే వ్యూయర్‌షిప్ ఆ మ్యాచ్‌కు ఏకంగా 60 శాతం పెరిగింది. మిగతా మ్యాచ్‌లకు ఏడు శాతం పెరిగింది.


ఫేస్‌బుక్‌తో ఐసీసీ భాగస్వామ్యం కూడా వీడియో వ్యూస్ పెరగడానికి చాలా సాయపడింది. ఈ టోర్నమెంట్‌కు అన్ని చానెల్స్ నుంచి 430 కోట్ల వ్యూస్ వచ్చాయి. 2019 ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్‌కప్‌కు 360 కోట్ల వ్యూస్ లభించాయి. అంటే 70 కోట్ల వ్యూస్ ఈ ప్రపంచకప్‌కు ఎక్కువగా వచ్చాయన్న మాట.


ఐసీసీ డిజిటల్ అసెట్స్‌లో ఉన్న చానెల్స్ ద్వారా 255 కోట్ల నిమిషాల వ్యూయర్ షిప్ లభించింది. ఐసీసీ సోషల్ మీడియా చానెళ్ల ద్వారా 61.8 కోట్ల ఎంగేజ్‌మెంట్ లభించింది. 2019 ఐసీసీ పురుషుల వరల్డ్‌కప్ కంటే ఇది 28 శాతం ఎక్కువ. 


Also Read: IPL 2022 Auction: శ్రేయస్‌కు షాకిచ్చిన దిల్లీ..! తామిద్దరినీ రీటెయిన్‌ చేసుకోవడం లేదన్న అశ్విన్‌


Also Read: Gambhir on Ajinkya Rahane: రహానె లక్కీ అనే చెప్పాలి మరి! గంభీర్‌ ఎందుకిలా అన్నాడో తెలుసా?


Also Read: KL Rahul Ruled Out: టీమ్‌ఇండియాకు షాక్‌..! కేఎల్‌ రాహుల్‌కు గాయం.. కివీస్‌తో టెస్టు సిరీసుకు దూరం!


Also Read: Ind vs Nz, 1st Test: అరెరె..! కోహ్లీని పలకరించిన ఈ కొత్త గెస్ట్‌ ఎవరో తెలుసా!!


Also Read: IPL 2022: ఐపీఎల్ 2022 మొదలయ్యేది ఆరోజే? మొదటి మ్యాచ్ ఎక్కడ.. ఎవరికి?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి