ఫార్మా రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక సంస్థరాబోతోంది. ఫార్మా లైఫ్ సైన్సెస్ విభాగాలకు మద్దతుగా ఉండేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఫ్లో కెమిస్ట్రీపై కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫార్మా రంగంలో "ఫ్లో కెమిస్ట్రీ టెక్నిక్"ల పరిశోధన , అభివృద్ధి, యాక్టివ్ ఫార్మా ఇంగ్రిడియంట్స్ తయారీ కోసం నిరంతర పరిశోధనల కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.
Also Read : తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు కరోనా ! తెలుగు రాష్ట్రాల సీఎంలకు తప్పని టెన్షన్ !
"ఫ్లో కెమిస్ట్రీపై కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" భారతదేశంలోని ఫార్మా పరిశ్రమకు పరిశోధన, అభివృద్ధి నుండి తయారీ వరకు అనేక అంశాల్లో సహాయకారిగా ఉంటుంది. ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ సమక్షంలో కన్సార్టియం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ "ఫ్లో కెమిస్ట్రీపై కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ఏర్పాటులో ప్రముఖ ఫార్మా సంస్థలు భాగస్వాములవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, లారస్ ల్యాబ్స్ , తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా, హైదరాబాద్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ వంటి సంస్థలు కూడా ఇందులో పార్టనర్స్. ఈ సంస్థలకు చెందిన ప్రతినిధులు కూడా ఒప్పందాలపై సంతకాలు చేశారు.
Also Read : ఏమీ తేల్చుకోకుండానే ఢిల్లీ నుంచి వెనక్కి కేసీఆర్ .. విమర్శలు ప్రారంభించిన విపక్షాలు !
ప్రపంచంలోనే ప్రముఖ పరిశోధనా సంస్థగా గుర్తింపు పొందిన డాక్టర్ రెడ్డీస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో "ఫ్లో కెమిస్ట్రీపై కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను ఏర్పాటు చేస్తారు. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, లారస్ ల్యాబ్స్ కావాల్సిన నిధులు సమకూరుస్తాయి. తెలంగాణ ప్రభుత్వం హబ్‌కు వ్యూహాత్మక మద్దతు అందిస్తుంది. కన్సార్టియంలో చేరడానికి, ప్రయోజనం పొందేందుకు మరిన్ని పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని..ఫార్మా కంపెనీలకు శాస్త్రీయ సామర్థ్యాలను పెంపొందించడానికి తగినన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టామని ప్రభుత్వం తరపు ప్రతినిధులు ప్రకటించారు.
Also Read : తెగువతో పని చేస్తే తెలంగాణలో మనదే అధికారం.. పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సందేశం !
ఫ్లో కెమిస్ట్రీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రసాయన, ఔషధ పరిశ్రమల్లో క్లీన్, గ్రీన్, సురక్షితమైన రసాయన సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి విస్తృతంగా పరిశోధనలు జరుపుతారు. ఫార్మాస్యూటికల్స్ రంగంలో గ్లోబల్ లీడర్‌గా హైదరాబాద్ స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. 800కి పైగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నాయి.
Also Read : సాయం కోసం రైతు కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయి.. వాళ్లే భారమయ్యారా?