తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని .. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌గా తేలిందన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. ఆయన కరోనా లక్షణాలు పెద్దగా లేవు. అయినా ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు. 


Also Read : సుజనా ఫౌండేషన్ సీఈవో హత్య ? బెంగళూరు రైల్వే ట్రాక్‌పై మృతదేహం !


పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలు స్నిగ్దారెడ్డి పెళ్లి ఆదివారం హైదరాబాద్ శివారులోని శంషాబాద్ పంక్షన్ హాల్లో వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ కూడా హాజరయ్యారు. పోచారంతో ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ఆప్యాయంగా మాట్లాడారు. భోజనం వడ్డించారు. ఈ కారణంగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు కరోనా సోకిన అంశం రెండు రాష్ట్రాల అధికార వర్గాల్లో హైలెట్ అవుతోంది.


Also Read : ఏమీ తేల్చుకోకుండానే ఢిల్లీ నుంచి వెనక్కి కేసీఆర్ .. విమర్శలు ప్రారంభించిన విపక్షాలు !


తెలంగాణ సీఎం కేసీఆర్‌కు గతంలోఓ సారి కరోనా సోకింది. తగ్గిపోయింది. అయితే కేసీఆర్ వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా ఎప్పుడూ బయటకు చెప్పలేదు. అధికారికంగా కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో స్పష్టత లేదు . ఈ అంశంపై బీజేపీ నేతలు అప్పుడప్పుడూ కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ ఉంటారు. ఏపీ సీఎం జగ‌మోహన్ రెడ్డి ఇంత వరకూ కరోనా బారిన పడలేదు. ఆయన కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా సోకిన పోచారం శ్రీనివాస్‌ కాంటాక్ట్ పర్సన్లుగా ఉన్న ముఖ్యమంత్రులు కరోనా పరీక్షలు చేయించుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టతలేదు.


Also Read : తెగువతో పని చేస్తే తెలంగాణలో మనదే అధికారం.. పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సందేశం !


కరోనా పూర్తిగా కంట్రోల్‌లోకి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవలే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కూడా సోకింది. ఆయన కూడా ఏఐజీలో చికిత్స పొంది కోలుకున్నారు.


Also Read : సాయం కోసం రైతు కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయి.. వాళ్లే భారమయ్యారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి