ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, టీడీపీ పాలనను మించి కేసీఆర్ పాలనలోనే అవినీతి ఎక్కువగా రాజ్యమేలుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ప్రజలంతా బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా ఆదరిస్తున్నారని..ప్రజా సంగ్రామ యాత్రకు వచ్చిన ఆదరణే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతోపాటు వివిధ వర్గాలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజా క్షేత్రంలోకి వెళ్లి నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులకు శిక్షణా కార్యక్రమంలో బండి సంజయ్ ప్రసంగించారు. 


Also Read : ఖమ్మంలో వామపక్షాలతో టీఆర్ఎస్‌ దోస్తీ.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు ప్లాన్ !


పాలకులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ది చెబుతారనడానికి దేశ చరిత్రతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని అనేక సంఘటనలే నిదర్శనమని బండి సంజయ్ గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదున్నారు. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పాలనలో ప్రజలు విసిగిపోయారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఫలితంగానే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. తర్వాత టీడీపీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేసిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్, టీడీపీ పాలన కంటే తెలంగాణలోని కేసీఆర్ హయాంలోనే అవినీతి ఎక్కువగా రాజ్యమేలుతోంది. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనపట్ల ప్రజలు విసిగిపోయారని బండి సంజయ్ స్పష్టం చేశారు. 


Also Read : కలెక్టర్ వాహనంపై 28 చలానాలు... వార్త వైరల్ అవ్వడంతో 15 చలానాలు చెల్లింపు..


ఈ పరిస్థితుల్లో ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా చూస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న, కార్యకర్తలున్న పార్టీ బీజేపీ మాత్రమే. ఎన్నికలొస్తాయి ..పోతాయి. బీజేపీ మాత్రం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతోందని బండి సంజయ్ స్పష్టం చేశారు.  బీజేపీకి నాయకులు ముఖ్యం కాదు. సిద్దాంతాలు ముఖ్యం. పార్టీకి లక్ష్యాలు, విధానాలు ముఖ్యం. నక్సలైట్ల నుండి చంపేస్తామంటూ వార్నింగులు వచ్చినా. కుటుంబాలకు దూరమై పార్టీ కోసం పనిచేసిన నాయకులెందరో బీజేపీలో ఉన్నారని గుర్తు చేశారు. 


Also Read:  ఫకీర్ మాటలు బంద్ చేయండి.. సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలో అలా అవమానం: మంత్రి ఎర్రబెల్లి


బీజేపీ ఏ మతానికీ వ్యతిరేకం కాదు. దేశద్రోహుల పార్టీని తరిమికొట్టే విషయంలో ఎన్నటికీ వెనుకాడం. దేశంలో హిందు సమాజం శ్రేయస్సు కోసం నిరంతరం ఆలోచించే పార్టీ బీజేపీ మాత్రమేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ మూల సిద్దాంతానికి లోబడే నిర్ణయాలుంటాయి. దేశ రాజకీయ, ఆర్దిక, సామాజిక అంశాలపట్ల ఎప్పటికప్పుడు కార్యకర్తలకు అవగాహన కల్పించి ప్రజా క్షేత్రంలో పనిచేయడానికి అవసరమైన ఆయుధాలను ఈ శిక్షణా తరగతుల ద్వారా అందిస్తున్నాం. శిక్షణ పొందిన కార్యకర్తలు, నాయకులు మరింత ఉత్సాహంగా, తెగువతో పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి విజయం తథ్యమని దిశా నిర్దేశం చేశారు.  


Also Read : సాయం కోసం రైతు కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయి.. వాళ్లే భారమయ్యారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి