వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021ని ఆమోదించారు.
ఈ నెల 29న మొదలయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తొలిరోజే దీనిని ప్రవేశపెట్టనున్నారు. మూడు చట్టాల రద్దుకు కలిపి ఒకే బిల్లును వ్యవసాయ మంత్రిత్వశాఖ రూపొందించినట్లు సమాచారం.
దేశంలో కొన్ని మినహా మిగతా ప్రైవేటు క్రిప్టో కరెన్సీల రద్దు లేదా నియంత్రణ, అధికారికంగా డిజిటల్ ద్రవ్యాన్ని జారీ చేయడానికి ఆర్‌బీఐను అనుమతించడం వంటి అంశాలతో పాటు మొత్తం 26 బిల్లుల్ని ఈ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
వెనక్కి తగ్గిన సర్కార్..
సాగు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. వీటిని వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఈనెల 26 నాటికి ఏడాది పూర్తికానున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకొంది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ- మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. దేశంలోని చిన్న, సన్నకారు రైతుల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించేందుకు సంపూర్ణ సదుద్దేశంతో ఈ చట్టాలను తీసుకొచ్చామని, అయినప్పటికీ కొందరు రైతులను ఒప్పించలేకపోయామని ఆయన పేర్కొన్నారు.
కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసినందుకు ప్రతిపక్షాలు రైతుల్ని అభినందించాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే భాజపా సర్కారు వెనక్కి తగ్గిందని అభిప్రాయపడ్డాయి. మొదట్లోనే అహంకారాన్ని విడిచిపెట్టి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాయి. అలా చేసి ఉంటే ఎన్నో ప్రాణాలు మిగిలి ఉండేవని పేర్కొన్నాయి. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ సహా ప్రతిపక్షాలన్నీ ఇదే అభిప్రాయాన్ని తెలిపాయి. సాగు చట్టాల రద్దు కావడం రైతులు సాధించిన చారిత్రక విజయంగా పేర్కొన్నాయి.
Also Read: Whatsapp Message Delete: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మెసేజ్ డిలీట్ చేయాలా? అయితే ఇక బేఫికర్!
Also Read: Corona Cases: దేశంలో 537 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also Read: కాఫీ అతిగా తాగితే హృదయ స్పందనల్లో తేడా... కనిపెట్టిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్
Also Read: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి
Also Read: సెక్స్ అంటే ఇష్టం లేనివాళ్ల కోసం ఈ డేటింగ్ యాప్, ఎంత మంది సభ్యులున్నారంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి