దేశంలో కొత్తగా 9,283 కరోనా కేసులు నమోదవగా 437 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,481కి పెరిగింది. 537 రోజుల్లో ఇదే కనిష్ఠం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.






రికవరీ రేటు 98.33%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. 10,949 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,39,57,698కి పెరిగింది.







  • మొత్తం కేసులు: 3,45,35,763

  • మొత్తం మరణాలు: 4,66,584

  • యాక్టివ్​ కేసులు: 1,11,481

  • మొత్తం కోలుకున్నవారు: 3,39,57,698


కేరళ.. 


కేరళలో కొత్తగా 4,972 కేసులు నమోదయ్యాయి. 370 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 50,97,845కు పెరిగింది. మృతుల సంఖ్య 38,045కు చేరింది.


మొత్తం 14 జిల్లాల్లో తిరువనంతపురంలో అత్యధికంగా 917 కేసులు నమోదయ్యాయి. త్రిస్సూర్ (619), కోజికోడ్ (527) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


నిన్న మొత్తం 60,265 కరోనా శాంపిళ్లను  పరీక్షించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


మహారాష్ట్ర.. 


మహారాష్ట్రలో కొత్తగా 766్ కరోనా కేసులు నమోదవగా 19 మంది మృతి చెందారు.


ప్రపంచవ్యాప్తంగా..


ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 5,53,076 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా​ ధాటికి 7,603 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,89,98,324కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 51,82,531కి పెరిగింది.


Also Read: కాఫీ అతిగా తాగితే హృదయ స్పందనల్లో తేడా... కనిపెట్టిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్


Also Read: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి


Also Read: సెక్స్ అంటే ఇష్టం లేనివాళ్ల కోసం ఈ డేటింగ్ యాప్, ఎంత మంది సభ్యులున్నారంటే...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి