మీరు తినే ఆహారమే ఆరోగ్యాన్ని,  తద్వారా జీవించే కాలాన్ని నిర్ణయిస్తుంది. ఎక్కువ కాలం పాటూ ఆరోగ్యంగా జీవించానుకునే వారు కచ్చితంగా చక్కటి ఆహారాన్ని తీసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త, ఆరోగ్య నిపుణులు డాక్టర్ జేమ్స్ డినికోలాంటోనియో తప్పనిసరిగాద తినవలసిన ఆహారల జాబితాను తయారుచేశారు. అందులో ఉన్న ఆహారాలను కచ్చితంగా తినాలని, వాటిని తరచూ తింటే దీర్ఘీయుష్షు మీ సొంతమవుతుందని చెబుతున్నార్నాయన. 


1. తేనె
ఎలాంటి ప్రాసెస్ చేయని తేనెను రోజూ కనీసం ఒక స్పూను అయినా తాగాలి. తేనెలో గుండె జబ్బులతో పాటూ, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించే శక్తి ఉంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ హెల్త్ లో ప్రచురించిన ఒక అధ్యయనంలో రొమ్ము, కాలేయం, కొలొరెక్టల్ క్యాన్సర్లు రాకుండా ఉండేందుకు తేనెను తాగమని సిఫారసు చేశారు. క్యాన్సర్ కణితిలు పెరగకుండా అడ్డుకోవడంలో తేనె అత్యంత సైటో టాక్సిక్ గా పనిచేస్తుందని, మిగతా సాధారణ కణాల విషయంలో మాత్రం నాన్ సైటోటాక్సిక్ అని చెప్పారు అధ్యయనకర్తలు. 


2. మేక కెఫిర్
కెఫిర్ అనేది ఒక డ్రింక్. మేకపాలతో దీన్ని తయారుచేస్తారు. ప్రపంచంలోని మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్లు కూడా ఒకటి. పులియబెట్టిన మేక కెఫిర్‌లో ఉండే ప్రోబయోటిక్స్ రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఇలా చేయడం ద్వారా క్యాన్సర్ కణితుల పెరుగుదలను తగ్గిస్తుంది. మేక కెఫిర్ వల్ల రొమ్ము క్యాన్సర్ కణాల సంఖ్య 56 శాతం తగ్గినట్టు ఓ పరిశోధనలో కనుగొన్నారు. కనుక మేక కెఫిర్ తయారు చేసే పద్దతి తెలుసుకుని, ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. 


3. దానిమ్మ
దానిమ్మలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు యాంటీ వైరల్, యాంటీ ట్యూమర్ లక్షణాలు కలిగి ఉంది. ‘నేచర్ మెడిసిన్’ జర్నల్ లో ప్రచురించిన కథనం ప్రకారం దానిమ్మలో మైటోకాండ్రియానే అనే అణువులు ఉంటాయి. ఇవి కండరాలకు చాలా అవసరం. ఈ అణువులు క్షీణిస్తే కండరాలు బలహీనపడతాయి. దీనివల్ల పార్కిన్సన్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే దానిమ్మను రోజూ తినాలి. ఈ పండు తినడం వల్ల దీర్ఘకాలం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. 


4. నిల్వ ఆహారాలు
పులియబెట్టిన ఆహారాలు, లేదా నిల్వ పచ్చళ్లు తింటే మంచిదే. అవి మీ జీవక్రియ రేటును మార్చగలవని అంటున్నాయి అధ్యయనాలు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు, ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని అందించేందుకు సహకరిస్తాయి. 


5. ఆకుపచ్చ అరటిపండు
మన పొట్టలో మంచి బ్యాక్టిరియా ఉంటుందని మీకు తెలిసిందే. అవి మనకు చాలా అవసరం కూడా. ఆ బ్యాక్టిరియాకు ఆహారాన్ని అందించే ప్రిబయోటిక్ ఆకుపచ్చ అరటిపండులో ఉంది. దీనివల్ల మంచి బ్యాక్టిరియా మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.  ఆకుపచ్చ అరటపండు రక్తపోటును తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. వివిధ అధ్యయనాల ప్రకారం, పచ్చి అరటిపండు తినడం వల్ల కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం యాభై శాతం తగ్గిపోతుంది. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: ఒళ్లు పెరిగితే పళ్లు రాలతాయా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది...