వాట్సాప్ మన రోజువారి జీవితంలో భాగమైపోయింది. ఇలా తెల్లారిందో లేదో.. అలా వాట్సాప్ ముఖం చూసేవాళ్లే ఎక్కువ. అందుకే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను సర్‌ప్రైజ్ చేస్తుంటుంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది వాట్సాప్.
ఆ టైమ్ కోసం..
వాట్సాప్‌లో 'Delete For Everyone' సమయాన్ని పెంచేందుకు సంస్థ ఆలోచిస్తోంది. ప్రస్తుతం మనం వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ చేస్తే అది డిలీట్ చేసేందుకు ఒక గంట 8 నిమిషాల 16 సెకన్ల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ సమయాన్ని 7 రోజుల 8 నిమిషాలకు పెంచేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది. ఈ ఫీచర్‌ను ముందుగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు తర్వాత ఐఓఎస్ వాళ్లకు ఇవ్వనుంది వాట్సాప్.
గంట 8 నిమిషాల 16 సెకన్ల కంటే ముందు పెట్టిన మెసేజ్‌ను మాత్రమే ప్రస్తుతం డిలీటే చేసే అవకాశం ఉంది. అయితే ఈ సమయాన్ని 7 రోజుల 8 నిమిషాలకు పెంచేలా త్వరలోనే అప్‌డేట్ రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. అధికారిక ప్రకటన వచ్చేలోపు దీనిపై మార్పులు కూడా జరగొచ్చు. - వాట్సాప్ ట్రేకర్