ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కాలేదు. టీఆర్ఎస్ తరపున తాతా మధుసూదరావు పోటీ పడుతున్నారు. అనూహ్యంగా ఆయనకు అవకాశం దక్కింది. టీఆర్ఎస్‌కు కావాల్సినంత బలం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి అధికారికంగానే పూర్తి బలం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 769 ఓట్లు ఉండగా అందులో టీఆర్‌ఎస్ పార్టీకి అధికారికంగా 497 ఓట్లు ఉన్నాయి. ఇతర పార్టీల వారు అనేక మంది టీఆర్ఎస్‌లో చేరారు. టీడీపీకి చెందిన 19, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన 75 మంది టీఆర్‌ఎస్ పార్టీలోనే చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌పార్టీకి సరాసరిగా 600 వరకు ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే.
Also Read : కలెక్టర్ వాహనంపై 28 చలానాలు... వార్త వైరల్ అవ్వడంతో 15 చలానాలు చెల్లింపు..
అయినప్పటికీ టీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం మాత్రం ఇప్పుడు వామపక్షాల ఓట్లపై కన్నేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండటంతో వామపక్షాల ఓట్లపై టీఆర్‌ఎస్ కన్నేసింది. సీపీఎం పార్టీకి 26 ఓట్లు, సీపీఐ పార్టీకి 34 ఓట్లు, న్యూడెమోక్రసీకి ఒక ఓటు ఉన్నాయి. వీరందర్నీ టీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
Also Read: ఫకీర్ మాటలు బంద్ చేయండి.. సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలో అలా అవమానం: మంత్రి ఎర్రబెల్లి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుండగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ మాత్రం రెండు ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికే టీఆర్ఎస్ ఒక్కొక్క స్థానానికే పరిమితం అయింది. వలసలతో టీఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉనప్పటికీ జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌కు తిరుగులేదు. కాంగ్రెస్ పార్టీకి ఓట్ల రూపంలో బలం చేకూరకుండా ఉండేందుకు, భవిష్యత్‌లో వామపక్షాలతో దోస్తీ దిశగా అడుగులు వేసేందుకు టీఆర్ఎస్ ఇప్పుడు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగానే సునాయాసంగా గెలుస్తారనే విషయం తెలిసినప్పటికీ టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సీపీఐ పార్టీకి స్నేహహస్తం అందించారని భావిస్తున్నారు.
Also Read : సాయం కోసం రైతు కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయి.. వాళ్లే భారమయ్యారా?
భవిష్యత్‌లో సీపీఐ పార్టీ టీఆర్‌ఎస్ పార్టీతో పొత్తు ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీ అడుగులు కనిపిస్తున్నాయి. మరోవైపు జిల్లాలో బలంగా ఉన్న మరో వామపక్ష పార్టీ సీపీఎంను సైతం మద్దతు అడుగుతారా..? లేదా..? అనేది వేచిచూడాల్సిందే. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లాగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీని దెబ్బతీసే దిశగా టీఆర్‌ఎస్ పార్టీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ఈడీ దూకుడు.. రూ. 144 కోట్ల ఆస్తుల జప్తు !