మరుమూల పల్లెలకు బస్సు సర్వీసుల వల్ల లాభమే ఉండదని ఇప్పటి వరకూ ఆర్టీసీ అధికారులు భావిస్తూ ఉంటారు. అందుకే చాలా సార్లు గ్రామీణ ప్రాంతాలకు సర్వీసులు రద్దు చేస్తూ ఉంటారు. అయితే ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఆర్టీసీ అధికారులు మాత్రం సరికొత్త ఆలోచనలతో పల్లె వెలుగు బస్సులను లాభాల బాటలోకి నడిపిస్తున్నారు. గ్రామస్తులు, విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన వెంటనే ఆ పల్లెకు బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నారు. మారుమూల ఏజెన్సీ గ్రామాలకూ బస్సులు నడుపుతున్నారు. అంతేకాదు, శుభకార్యాలు, పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలకూ ఎటువంటి డిపాజిట్‌ లేకుండా బస్సులను నడిపేందుకు సంస్థ సంసిద్ధంగా ఉంది. మాలధారణ భక్తులకు, పెళ్లిళ్లకు, విహారయాత్రకు 50మంది ప్రయాణికులు ఉంటే నేరుగా అక్కడికే బస్సును పంపిస్తున్నారు. 


Also Read : తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు కరోనా ! తెలుగు రాష్ట్రాల సీఎంలకు తప్పని టెన్షన్ !


కొత్తగూడెం డిపో పరిధిలో జూలూరుపాడు మండలం కాకర్ల, టేకులపల్లి మండలం బోడు, పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామానికి బస్సులను ఆర్టీసీ అధికారులు పునరుద్ధరించారు. ఈ గ్రామాల నుంచి ఎక్కువగా విద్యార్థులు, వ్యవసాయ కూలీలు, ఇతరత్రా పనుల కోసం మండల కేంద్రానికి వస్తుంటారు. కొత్తగూడెం నుంచి కాకర్లకు 12సంవత్సరాల క్రితం బస్సు నడిచేది.  టేకులపల్లి మండలంలోని బోడు ప్రాంతానికి 17సంవత్సరాల క్రితం ప్రతిరోజు బస్సు సర్వీస్‌ నడిచేది. 


Also Read : సుజనా ఫౌండేషన్ సీఈవో హత్య ? బెంగళూరు రైల్వే ట్రాక్‌పై మృతదేహం !


తర్వాత ఆపేశారు. పాల్వంచ మండలంలోని మారుమూల గ్రామం ఉల్వనూరు పాల్వంచ నుంచి సుమారు 20కిలోమీటర్లపైనే ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో, ఇతరత్రా పనులకు పాల్వంచ రావాల్సిందే. ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణం భారంగా మారింది. ఈ మూడు గ్రామాలకు దగ్గరలోని మండల కేంద్రానికి వెళ్లాలంటే ఆటో చార్జీలు రూ.40 పైగానే వసూలు చేస్తున్నారు. దీంతో వారి విజ్ఞప్తుల మేరకు గత వారం నుంచి ఈ గ్రామాలకు బస్సులను నడుపుతున్నారు.  


Also Read : ఏమీ తేల్చుకోకుండానే ఢిల్లీ నుంచి వెనక్కి కేసీఆర్ .. విమర్శలు ప్రారంభించిన విపక్షాలు !


శుభకార్యాలు, పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలకు ఎటువంటి డిపాజిట్‌ లేకుండా బస్సులను నడిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో డిపాజిట్‌ చేస్తేనే బస్సులను అద్దెకు ఇచ్చేవారు. కానీ ఆర్టీసీకి మరింత ఆదరణ పెంచాలని, సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయాణికులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నది. మాలధారణ భక్తులకు, పెళ్లికి, విహారయాత్రకు 50మంది ప్రయాణికులు ఉంటే నేరుగా అక్కడికే బస్సును పంపిస్తున్నది. రానున్నరోజుల్లో తల్లీపిల్లల ఫీడింగ్‌ సెంటర్లను కూడా ఆయా పరిధిలో ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నది.


Also Read : తెగువతో పని చేస్తే తెలంగాణలో మనదే అధికారం.. పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సందేశం !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి